Breaking News

Konduri Srinivasa Rao

రాష్ట్రంలో ఎండ తీవ్రత రికార్డు స్థాయిలో నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఎండ తీవ్రత రికార్డు స్థాయిలో నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు.మరో మూడు రోజులు పాటు ఇదే తీవ్రత కొనసాగే అవకాశం ఉందన్నారు. వీలైనంత వరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 మధ్య ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించారు. అత్యవసర ప్రయాణాల్లో తప్పనిసరిగా మంచినీరు వెంట తీసుకుని వెళ్లాలన్నారు. ఇవాళ సీజన్లోనే గరిష్ఠ ఉష్ణోగ్రత తూర్పుగోదావరి జిల్లా చిట్యాలలో 48.3డిగ్రీలు, పశ్చిమగోదావరి …

Read More »

ఘనంగా వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు పుట్టినరోజు వేడుకలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విద్యార్థి దశ నుంచే స్వర్గీయ దేవినేని నెహ్రూ ఆశయాలను ఆదర్శంగా తీసుకుని, ఆయన అడుగుజాడల్లో నడుస్తూ వ్యక్తిగతంగా, రాజకీయంగా మా కుటుంబానికి అత్యంత సన్నిహితులుగా, కుటుంబ సభ్యుల్లా ప్రతి సందర్భంలో అండగా నిలుస్తున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కడియాల బుచ్చిబాబుకి ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ ప్రజాసేవ పట్ల అంకితభావం, పార్టీ పట్ల మీ నిబద్ధత ఎల్లప్పుడూ అందరికీ ఆదర్శంగా …

Read More »

ఇంద్రకీలాద్రిపై పోటెత్తిన భక్తుల జనం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వేసవి ఎండల్లోనూ కల్పించిన చల్లని సౌకర్యాలపై సర్వత్రా హర్షం విజయవాడ:ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. వేసవి సెలవుల నేపథ్యంలో ఈరోజు తెల్లవారుజామున 5 గంటల నుంచే భక్తుల రాక విపరీతంగా పెరిగింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు తెల్లవారుజాము నుంచే ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.రద్దీ అత్యంత భారీగా పెరగడంతో, సాధారణ భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించేందుకు అధికారులు ఉదయం 9 …

Read More »

నిజాంపేట్ లో రాజీవ్ గాంధీ నగర్ లో ఉచిత వైద్య శిబిరం ప్రారంభం

-పరిపూర్ణ ఆరోగ్యానికి తరచూ వైద్య పరీక్షలు అవసరం – డా. మురళీ కృష్ణ నిజాంపేట్ (హైదరాబాద్), నేటి పత్రిక ప్రజావార్త : పరిపూర్ణ ఆరోగ్యానికి తరచూ ప్రాధమిక వైద్య పరీక్షలు చేయించుకుంటే అన్నీ విధాలుగా శ్రేయస్కరమని ఎయిర్ ఫోర్స్ విశ్రాంత అధికారి డా. మురళీ కృష్ణ అన్నారు. మానవసేవే మాధవ సేవ గా భావించే డా.మురళీ కృష్ణ బాచుపల్లి మున్సిపాలిటీ నిజాంపేట్ రాజీవ్ గాంధీ నగర్ లోని క్రిష్ మెడ్ స్పెషాలిటీ క్లినిక్స్ లో మహిళలు, సీనియర్ సిటిజన్స్ కు ఆదివారం ఉచిత వైద్య …

Read More »

ఎండల పట్ల అప్రమత్తంగా ఉండండి : యార్లగడ్డ

గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : మండుతున్న ఎండల పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సూచించారు. గన్నవరం నియోజకవర్గంలోని పలుప్రాంతాల్లో ఇప్పటికే 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అవుతుందని, మరో వారం రోజులపాటు ఇదే రీతిగా ఎండల తీవ్రత కొనసాగటంతోపాటు వడగాల్పులు వీస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలందరూ ముందస్తు జాగ్రత్త చర్యలు పాటించాలన్నారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఇంటి నుంచి బయటకు రావద్దని ఒకవేళ అత్యవసరంగా …

Read More »

వెల్ఫేర్ బోర్డు, సంక్షేమ నిధిని ఏర్పాటు చేయాలి PTLPWA సదస్సులో వక్తల డిమాండ్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రైవేటు టీచర్స్, లెక్చరర్స్, ప్రొఫెసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (PTLPWA), ఆధ్వర్యంలో ప్రైవేటు ఉపాధ్యాయ, అధ్యాపకుల సదస్సు స్థానిక యుటిఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో జరిగింది. దీనికి ముఖ్య వక్తగా బొర్రా గొపిమూర్తి ఉమ్మడి గోదావరి జిల్లాల టీచర్స్ ఎంఏల్ సి పాల్గొని మాట్లాడారు. మీరు అడగకుండానే నేను మీ సమస్యలపై ఇప్పటికే రెండు సార్లు అసెంబ్లీలో మాట్లాడాను. ప్రైవేటు ఉపాధ్యాయ, అధ్యాపకుల గుర్తింపు కార్డు, హెల్త్ కార్డు ఇవ్వాలి. వెల్ఫేర్ బోర్డు, నిధిని ఏర్పాటు చేయాలి. ఉద్యోగ బద్రత …

Read More »

అగ్నికుల క్షత్రియులకు విద్యాపరమైన నిధులు ప్రభుత్వం కేటాయించాలి… : సైకం తిరుమల రావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అగ్నికుల క్షత్రియులకు విద్యాపరమైన నిధులు ప్రభుత్వం కేటాయించాలని సైకం తిరుమల రావు అన్నారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భవిష్యత్ తరాల అగ్నికుల క్షత్రియుల సామాజిక వర్గంలో అగ్నికుల, వన్నె కుల క్షత్రియ, వన్నె రెడ్డి, వన్నె కాపులకు ప్రభుత్వం నుంచి విద్యా పరమైన నిధులు అందించాలని కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు వెల్లడించారు. ఎడ్యుకేషన్ జీవోలో మిగతా కులాల నుంచి వేరు చేస్తూ అగ్నికుల క్షత్రియులకు ప్రత్యేక …

Read More »

‘లేపాక్షి’కి సాంకేతిక హంగులు

-హస్త కళారూపాల అమ్మకాల పెంపే లక్ష్యం -తరంగా ఏఐ ఆధారిత డిజిటల్ వ్యవస్థ రూపకల్పన -రాష్ట్ర స్థాయి నుంచే లేపాక్షి షో రూమ్ ల పర్యవేక్షణ -ఏ రోజుకారోజు స్టాక్, అమ్మకాల వివరాల నమోదు -స్టాక్ పై ఎప్పటికప్పుడు అలెర్ట్స్ -ఇంటికే హస్త కళారూపాలు అందించేలా కళాక్షి వాట్సాప్ లింక్ రూపకల్పన -ఏఐ టూల్ తో లింక్ లో హస్త కళల సమాచారం -వాట్పాప్ లోనే హస్త కళలకు ఆర్డర్లు… డోర్ డెలివరీ -హస్త కళాకారులకు గౌరవ ప్రద జీవనమే లక్ష్యం : మంత్రి …

Read More »

‘ఎబోలా’పై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం!

-కాంగో, ఉగాండా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు వైద్య పరీక్షలు చేసేలా చర్యలు -విశాఖ, తిరుపతి, విజయవాడ ఇంటర్నేషనల్ విమానాశ్రయాలపై ప్రత్యేక దృష్టి! -అన్ని జిల్లాలకు ప్రత్యేక ఆదేశాలు -రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆఫ్రికా ఖండంలోని పలు దేశాల్లో ఎబోలా వైరస్ విస్తృతి, కేసులు, మరణాల నమోదు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి  సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. …

Read More »

సంప్ర‌దాయేత‌ర ఇంధ‌న వనరులతోనే ఇంధన సమస్యకు ప‌రిష్కారం

-పీఎం సూర్య‌ఘ‌ర్ ప‌థ‌కంతో అంద‌రికీ లాభ‌దాయ‌కం -త్వ‌ర‌లోనే అర్హులైన వారికి కొత్త పెన్ష‌న్లు, ఇళ్లు మంజూరు -ప్ర‌కాశం జిల్లా ప‌ర్య‌ట‌న‌లో మంత్రి గొట్టిపాటి అద్దంకి, నేటి పత్రిక ప్రజావార్త : సంప్ర‌దాయేత‌ర ఇంధ‌న వనరుల వినియోగంతోనే ఇంధన సమస్యకు ప‌రిష్కారం ల‌భిస్తుంద‌ని ఇంధ‌న శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ పేర్కొన్నారు. ప్ర‌కాశం జిల్లా అద్దంకి నియోజ‌క‌వ‌ర్గంలో మంత్రి గొట్టిపాటి ఆదివారం ప‌ర్య‌టించారు. సంత‌మాగులూరు మండ‌లంలో వివిధ గ్రామాల్లో జ‌రిగిన ప‌లు కార్య‌క్ర‌మాల్లో ఆయ‌న పాల్గొన్నారు. బండివారిపాలెంలో పీఎం సూర్య‌ఘ‌ర్ ప‌థ‌కాన్ని ప్రారంభించారు. బండివారిపాలెం నుంచి …

Read More »