Breaking News

Konduri Srinivasa Rao

ప్రతి అర్జీపైనా ప్రత్యేక దృష్టిపెట్టండి..

-అర్జీదారులు సంతృప్తి చెందేలా సమస్యను పరిష్కరించండి -జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ అత్యంత ప్రతిష్టాత్మక ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) ద్వారా అందుతున్న ప్రతి అర్జీపైనా ప్రత్యేక దృష్టిపెట్టాలని.. అర్జీదారులు సంతృప్తి చెందేలా సమస్యను పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ అన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసెల్ సిస్టం-పీజీఆర్ఎస్) కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ.. డీఆర్‌వో …

Read More »

మండే ఎండ‌ల్లో నీరు, నీడా.. నిండుగా ఉండాలి..

– ప్ర‌యాణికుల‌కు ఎక్క‌డా ఎలాంటి ఇబ్బంది క‌ల‌గ‌కూడ‌దు – అవ‌స‌రం మేర‌కు తాగునీటి పాయింట్లు పెంచాలి – పీఎన్‌బీఎస్ లో క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ ఆక‌స్మిక త‌నిఖీ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వేసవి ఉద్ధృతి నేపథ్యంలో ప్రయాణికులకు తాగునీరు, నీడ, పారిశుద్ధ్య సదుపాయాలు సమృద్ధిగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ సోమ‌వారం న‌గ‌రంలోని పండిట్ నెహ్రూ బ‌స్ స్టేష‌న్ (పీఎన్‌బీఎస్‌)ను ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. వేస‌వి తీవ్ర‌త ఎక్కువ‌గా ఉన్న నేప‌థ్యంలో …

Read More »

పెన్ష‌న్ల పంపిణీలో సంతృప్తి స్థాయి ప్ర‌ధానం

– ల‌బ్ధిదారుల నుంచి ఫిర్యాదుల‌కు తావులేకుండా చూడాలి – ప్ర‌జ‌ల విశ్వాసాన్ని నిలబెట్టేలా అధికారులు పనిచేయాలి – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ ప్రక్రియలో లబ్ధిదారుల సంతృప్తి స్థాయి అత్యంత ముఖ్యమని, ల‌బ్ధిదారుల నుంచి ఎలాంటి ఫిర్యాదుల‌కు తావులేకుండా సేవ‌లందించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అన్నారు. సోమ‌వారం క‌లెక్ట‌రేట్ శ్రీ పింగ‌ళి వెంక‌య్య స‌మావేశ మందిరంలో క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ‌.. పెన్ష‌న్ పంపిణీ అధికారుల‌ (పీడీవో)తో స‌మావేశ‌మయ్యారు. ఎంపీడీవోలు, మునిసిప‌ల్ క‌మిష‌న‌ర్లు …

Read More »

లేబర్ అడ్డా ను కార్మికశాక అధికారులతో సందర్శన

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో ఏర్పాటు చేస్తున్న లేబర్ అడ్డా (ఇంటిగ్రేటెడ్ లేబర్ ఆమెనిటీస్ కాంప్లెక్స్) కార్మికుల సంక్షేమానికి ఎంతో దోహదపడుతుందని, దీనిని ప్రతి ఒక్క కార్మికుడు సద్వినియోగ పరచుకోవాలని నగర పాలక సంస్థ కమిషనర్ కె.మయూర్ అశోక్ అన్నారు. సోమవారం గుంటూరు నగరంలోని పట్టాభిపురం వద్ద కార్మికులకు ప్రత్యేకంగా నగర పాలక సంస్థ మరియు కార్మిక శాఖ సంయుక్తంగా ఏర్పాటు చేసిన లేబర్ అడ్డా (ఇంటిగ్రేటెడ్ లేబర్ ఆమెనిటీస్ కాంప్లెక్స్) ను కార్మికశాక అధికారులతో కలిసి సందర్శించారు. తొలుత లేబర్ …

Read More »

పారిశుధ్య పనులు, అభివృద్ధి పనుల తనిఖీ…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనుల నిర్వహణలో కాంట్రాక్టర్లు నాణ్యతాప్రమణాలు పాటించేలా ఇంజనీరింగ్ అధికారులు ప్రతేక పర్యవేక్షణ చేయలాని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం నగరంలోని 2వ డివిజన్ లలోని మణిపురం బ్రిడ్జ్, సీతా నగరం మరియు నగరంలోని ప్రధాన రహదారుల్లో అధికారులతో కలిసి పర్యటించి పారిశుధ్య పనులు, అభివృద్ధి పనులను తనిఖీ చేసి తీసుకోవాల్సిన చర్యల పై అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ తొలుత …

Read More »

పిర్యాదుల పరిష్కారం పై విభాగాధిపతులతో ప్రత్యేక సమావేశం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : కోర్ట్ కేసులకు సంబంధించి పారావైజ్ రిమార్క్స్ మరియు కౌంటర్ ఫైల్స్ ను ఎప్పటికప్పడు దాఖలు చేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ నగర పాలక సంస్థ విభాగాదిపతులను ఆదేశించారు. సోమవారం నగర పాలక సంస్థ పై వేస్తున్న కోర్ట్ కేసులకు సంబంధించి మరియు పి.జి.ఆర్.యస్, కాల్ సెంటర్ కు వస్తున్న వివిధ పిర్యాదుల పరిష్కారం పై మరియు నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో విభాగాధిపతులతో ప్రత్యేక సమావేశం జరిగింది. సమావేశం నందు తొలుత విభాగాల …

Read More »

అర్జీల పరిష్కారం పట్ల అధికారులు త్వరితగతిన స్పందించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల నుండి అందే అర్జీల పరిష్కారం పట్ల అధికారులు త్వరితగతిన స్పందించాలని, ప్రజా సమస్యల పట్ల అలసత్వం వహించే వారిపై కఠిన చర్యలు తప్పవని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ కె.మయూర్ అశోక్ హెచ్చరించారు. సోమవారం జిఎంసి కౌన్సిల్ సమావేశ మందిరంలో నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమంలో కమిషనర్ పాల్గొని ప్రజల నుండి అర్జీలను నేరుగా స్వీకరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటికి శాశ్వత పరిష్కారం …

Read More »

కేజీబీవీల్లో టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

-ఈ నెల (27.05.2026) నుంచి దరఖాస్తులు స్వీకరణ -సమగ్రశిక్ష స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు IAS.,  విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 352 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 299 బోధనా సిబ్బంది పోస్టులను ఒప్పంద (కాంట్రాక్ట్) ప్రాతిపదికన భర్తీ చేయడానికి అర్హులైన మహిళా అభ్యర్థుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి. శ్రీనివాసరావు, I.A.S. ఒక ప్రకటనలో తెలిపారు. తూర్పు గోదావరి, డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ, …

Read More »

గోవధ నిషేధాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా వ్యాప్తంగా బక్రీద్ పండుగ సందర్భంగా గోవధ నిషేధాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్ నగరంలోని మీకోసం సమావేశం మందిరంలో పశుసంవర్ధక శాఖ గోవధ నిషేధంపై రూపొందించిన గోడ పత్రాలను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గోవధ నిషేధము జంతు సంరక్షణ చట్టం 1977 ప్రకారం గోవులను వధించడం చట్టరీత్యా నేరం అన్నారు. గోవదకు పాల్పడిన అందుకు సహాయపడిన వారు …

Read More »

ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమంలో అర్జీలపై ప్రత్యేక శ్రద్ధ

-సకాలంలో పరిష్కారం చూపాలని అధికారులకు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదేశం మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమంలో ప్రజల నుంచి అందే అర్జీలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి, వాటిని సకాలంలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం కలెక్టరేట్‌లోని పీజీఆర్ఎస్ సమావేశపు మందిరంలో నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. జిల్లా కలెక్టర్ ఈ మేరకు జాయింట్ కలెక్టర్ …

Read More »