Breaking News

Daily Archives: March 17, 2025

అన్నక్యాంటీన్లు పేదల ఆకలి తీర్చే అక్షయపాత్రల వలె నిలిచాయి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : అన్న క్యాంటీన్లలో ఆహారం తీసుకుంటున్న ప్రజలు ఎంతో సంతృప్తి వ్యక్తం చేస్తూ, రూ.5తో ఆకలి తీరుస్తున్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్  అన్నారు. సోమవారం మిర్చి యార్డ్ దగ్గరలోని అన్న క్యాంటీన్ ని పశ్శిమ నియోజకవర్గ శానసభ్యులు గల్లా మాధవి తో కలిసి పరిశీలించి, టిఫిన్ చేసి, ప్రజలతో మాట్లాడి, సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్  మాట్లాడుతూ అన్న క్యాంటీన్ల ద్వారా రూ.5కే నాణ్యమైన, రుచికరమైన …

Read More »

రాష్ట్ర‌ప‌తి అల్పాహార విందుకు హాజరైన‌ ఎంపి కేశినేని శివ‌నాథ్

ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతి భవన్ లో ఇచ్చిన అల్పాహార విందు కార్యక్రమంలో కేంద్ర ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ , స్పీకర్ ఓం బిర్లా, బి.జె.పి జాతీయ అధ్యక్షుడు ఎంపి జెపి న‌డ్డా, కేంద్ర‌మంత్రులు, స‌హ‌చ‌ర‌ ఎంపిల‌తో క‌లిసి విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) సోమ‌వారం పాల్గొన్నారు. రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌దీ ముర్ము ఈ అల్పాహార విందుకు ఆంధ్ర‌ప్ర‌దేశ్ , కేర‌ళ‌, క‌ర్ణాట‌క‌, హార్యానా రాష్ట్రాల‌కు చెందిన ఎంపిల‌ను ఆహ్వానించారు. ఈ విందులో …

Read More »

పశ్చిమ నియోజకవర్గాన్ని అగ్రగామిగా నిలబెడతా

-ఎమ్మెల్యే సుజనా చౌదరి విజయవాడ,నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలబెడతానని అందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నానని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ చౌదరి (సుజనా చౌదరి) అన్నారు. ది క్లాత్ మర్చంట్ అసోసియేషన్ ముఠా కార్మికులకు సోమవారం భవానిపురం లోని ఎన్డీయే కార్యాలయంలో 250 మంది కార్మికులకు ఏకరూప దుస్తులను (యూనిఫామ్) ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఠా కార్మికులతో సమావేశమయ్యామని అప్పట్లో వారు …

Read More »

ఇఫ్తార్ విందు మతసామరస్యానికి ప్రతీక

-ఎమ్మెల్యే సుజనా చౌదరి విజయవాడ,నేటి పత్రిక ప్రజావార్త : పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉండే ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందు ఆత్మీయత, మతసామరస్యానికి ప్రతీక అని పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) అన్నారు. సోమవారం భవానిపురం లోని హజ్రత్ గాలిబ్ షాహిబ్ దర్గా ప్రాంగణంలో ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే సుజనా చౌదరి పాల్గొన్నారు. సామూహిక నమాజ్ అనంతరం ఉపవాస దీక్ష చేపట్టిన ముస్లిం సోదరులకు ఫలహారం తినిపించారు. ఈ సందర్భంగా సుజనా …

Read More »

పాతబస్తీ షేక్ రాజా సాహెబ్ ఆసుపత్రిలో నూతన ల్యాబ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి

విజయవాడ,నేటి పత్రిక ప్రజావార్త : కొత్తపేటలోని షేక్ రాజా సాహెబ్ ఆసుపత్రిలో నూతనంగా ఆధునికరించిన ల్యాబ్ మరియు బ్లడ్ స్టోరేజ్ యూనిట్ ను ఎమ్మెల్యే సుజనా చౌదరి సోమవారం ప్రారంభించారు. జైన్ సమాజ్ సహకారంతో సుమారు రూ 12 లక్షల నిధులతో ఆధునికరించిన ఈ ల్యాబ్ లో సుమారు 75 రకాల పరీక్షలు ఉచితంగా చేయనున్నారు. విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు లు ఎన్డీయే కూటమి నేతలతో కలిసి లాబ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ …

Read More »

ఘనంగా ధ్వజస్తంభ ప్రతిష్ఠ

విజయవాడ,నేటి పత్రిక ప్రజావార్త : ఆలయానికి మూల విరాట్టు ఎంత ముఖ్యమో.. ధ్వజస్తంభం కూడా అంతే ముఖ్యమని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. వాంబే కాలనీలోని శ్రీదేవి భూదేవి సమేత సంతాన వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవం వేద మంత్రాల నడుమ సోమవారం అంగరంగ వైభవంగా జరిగింది. గుడికి వెళ్లగానే ముందుగా కనిపించేది ధ్వజస్తంభమేనని.. దేవాలయాల్లో షోడశోపచార పూజలు జరగాలంటే ధ్వజస్తంభం తప్పనిసరిగా ఉండాలని మల్లాది విష్ణు అన్నారు. గర్భగుడిలో ఉండే దైవానికి చేసే అనుష్ఠాన …

Read More »

అప్పులపై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలి

-వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ,నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర అప్పులపై కూటమి ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 10 నెలల కాలంలో చేసిన రూ. 1.26 లక్షల కోట్ల అప్పులపై వెంటనే శ్వేత పత్రం విడుదల చేసి.. ఆ అప్పు ఎలా ఖర్చు చేశారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ఆ బాధ్యత కచ్చితంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ …

Read More »

శనగల (బెంగాల్ గ్రామ్) కొనుగోలు కేంద్రాలు ప్రారంభం..

-నేటి( మంగళవారం) నుండి కొనుగోళ్లు ప్రారంభం….. -వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు: 8978381836 & మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ నెంబర్:9652095861 -జిల్లా కలెక్టర్ డా. జి లక్ష్మీశ విజయవాడ,నేటి పత్రిక ప్రజావార్త : ఎ.పి.మార్క్ ఫేడ్ మరియు నాఫేడ్ అధ్వర్యంలో ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరతో కొనుగోలు కేంద్రాలను మంగళవారం నుండి ప్రారంభిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా. జి లక్ష్మీశ ఒక ప్రకటనలో తెలిపారు. శనగల (బెంగాల్ గ్రామ్) కొనుగోళ్లకు జిల్లాలో ఇబ్రహీంపట్నం, కంచికచర్ల, వీరులపాడు, చందర్లపాడు మండలాల్లో 12 ప్రైమరీ అగ్రికల్చరల్ క్రెడిట్ సొసైటీస్(PACS), …

Read More »

ప్ర‌జాప్ర‌తినిధుల క్రీడ‌ల‌కు స‌ర్వం సిద్ధం

-శాప్ ఆధ్వ‌ర్యంలో ప‌టిష్ట ఏర్పాట్లు -క్రీడా కోర్టులను ప‌రిశీలించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు -రేపు 3 గంటలకు ప్రారంభంకానున్న క్రీడ‌లు -అనిమిని ర‌వినాయుడు, శాప్ ఛైర్మ‌న్ విజయవాడ,నేటి పత్రిక ప్రజావార్త : ప్ర‌జాప్ర‌తినిధుల‌కు ఉప‌శ‌మ‌నం క‌లిగించేదిశ‌గా కూట‌మి ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా శాస‌న‌స‌భ్యులు, శాస‌న‌మండలి స‌భ్యుల క్రీడ‌ల‌ను స‌మ‌ర్థ‌వంతంగా నిర్వ‌హించేందుకు శాప్ ఆధ్వ‌ర్యంలో స‌ర్వం సిద్ధం చేసిన‌ట్లు శాప్ ఛైర్మ‌న్ అనిమిని ర‌వినాయుడు తెలిపారు. ఈ సందర్భంగా శాప్ చైర్మన్ మాట్లాడుతూ శాస‌న‌స‌భ్యులు, శాస‌న‌మండలి స‌భ్యుల క్రీడ‌ల‌కు సంబంధించి విజ‌య‌వాడ‌లోని ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో మంగళవారం నుంచి …

Read More »

ప్రతి మహిళా చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి

విజయవాడ,నేటి పత్రిక ప్రజావార్త : సమాజంలో ప్రతి మహిళ చట్టాలపై సమగ్రంగా అవగాహన కలిగి ఉండాలని ప్రొడక్షన్ ఆఫీసర్ నాన్ ఇన్స్టిట్యూషనల్ కేర్ (పోనిక్) ప్రతినిధి జాన్సన్ అన్నారు. బేటి బచావో బేటి పడావో కార్యక్రమంలో భాగంగా స్థానిక సింగ్ నగర్ లోని 59 వ డివిజన్ అర్బన్ హెల్త్ సెంటర్ పరిధిలో సోమవారం మహిళలు, బాలల చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య ముఖ్య అతిథిగా హాజరైన పోనిక్ ప్రతినిధి జాన్సన్ మాట్లాడుతూ మహిళలు, చిన్నారులు వృద్ధులకు ప్రత్యేకంగా చట్టాలను …

Read More »