Breaking News

ప్రజా సమస్యల పరిష్కార వేదిక లో వచ్చిన (PGRS) అర్జీలను గడువులోగా సంతృప్తి స్థాయిలో పరిష్కారం చూపాలి

-రీఓపెన్ కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టాలి : జిల్లా కలెక్టర్ డా. ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా సమస్యల పరిష్కార వేదిక లో వచ్చిన (PGRS) అర్జీలను గడువులోగా సంతృప్తి స్థాయిలో పరిష్కారం చూపాలి అని సంబంధిత జిల్లా అధికారులను జిల్లా కలెక్టర్ డా. ఎస్ వెంకటేశ్వర్ ఆదేశించారు. మంగళవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) పై జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, జిల్లా రెవెన్యు అధికారి నరసింహులు, జిల్లా అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ డా.ఎస్ వెంకటేశ్వర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు (PGRS) అధిక ప్రాదాన్యత ఇస్తుందని, అర్జీలకు సంతృప్తి స్థాయిలో నాణ్యమైన పరిష్కారం చూపాలని తెలిపారు. పెండింగ్ లో ఉన్న అర్జీలను ప్రణాళిక బద్ధంగా సంబంధిత అధికారులు పరిష్కారం చూపాలన్నారు. క్షేత్ర స్థాయిలో స్వయంగా వెళ్లి పారదర్శకంగా విచారణ చేసి అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపుపరిష్కరించాలన్నారు. పరిష్కారం చూపలేని అర్జీదారునికి స్పష్టంగా ఎండార్స్మెంట్ చేసి తెలపాలని ఆదేశించారు. ఎండార్స్మెంట్లను జాగ్రత్తగా అప్లోడ్ చేయాలని తెలిపారు. సరైన పరిష్కారo చూపగలిగితే రీ ఓపెన్ కేసుల సంఖ్య తగ్గుతుందని తెలిపారు. పదే పదే రీ ఓపెన్ అవుతున్నా కేసులపై సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. అర్జిదారులు వారి సమస్యకు పరిష్కార దిశగా గ్రీవెన్స్ రావడం జరుగుతుందని సంబంధిత అధికారులు అర్జీదారునితో స్వయంగా మాట్లాడి వారి సమస్యలను సావధానoగా విని సంతృప్తి స్థాయిలో పరిష్కారo చూపాలని అన్నారు. అర్జీలు ఎక్కువ శాతం బియాండ్ ఎస్ ఎల్ కు వెళ్లకుండా రోజువారీగా ఓపెన్ చేసుకోవాలని తెలిపారు.

పి 4 సర్వే పక్రియలో భాగంగా ఎంపిడిఓ లు, మున్సిపల్ కమీషనర్ లు ప్రత్యేక దృష్టి పెట్టీ వెనుకబడిన గ్రామాలలో సర్వే ప్రక్రియ ను త్వరిత గతిన పూర్తి చేయాలని తెలిపారు. పల్లె పండుగ కార్యక్రమములో భాగంగా సి సి రోడ్ల పనులను త్వరితగతిన పూర్తి చేయవలసినదిగా సంబంధిత పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. వర్క్ ఫ్రమ్ హోం సర్వ్ ప్రక్రియ ను వేగవంతం చేయాలని అన్నారు. ఈ నెల 24, 25 వ తేదీలలో కలెక్టర్లు కాన్ఫరెన్స్ జరగనున్న నేపథ్యంలో జిల్లా ప్రగతి పైన సంబంధిత జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో డి పి ఓ సుశీలా దేవి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రోస్మాండ్, డిఆర్డిఏ పిడి శోభన్ బాబు డ్వామా పిడి శ్రీనివాస్ ప్రసాద్, డిఎం అండ్ హెచ్ ఓ బాలకృష్ణ నాయక్, సంబంధిత జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *