ఈ నెల 20 న తిరుమల కు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాక

రేణిగుంట, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ నెల 20 న ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తిరుపతి, తిరుమల కు రావడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్.ఎస్. పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం రేణిగుంట విమానాశ్రయం నందు జిల్లా ఎస్పీ హర్ష వర్ధన్ రాజు,ఎయిర్పోర్ట్ డైరెక్టర్ డి.భూమినాధన్ తో కలసి ASL లో ( ముందస్తు భద్రత లైజన్ ) భాగంగా జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి పర్యటన భద్రత ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తిరుపతి, తిరుమల పర్యటన సందర్భంగా ఎలాంటి చిన్న పొరపాట్లు కు తావులేకుండా సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేసి ముఖ్యమంత్రి పర్యటనను వంతం చేయాలన్నారు.
ఈ నెల 20 న గురువారం రాత్రి 9.30 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుని అక్కడి నుండి రోడ్డు మార్గాన తిరుమల శ్రీపద్మావతి అతిథి గృహం చేరుకుంటారని తెలిపారు.,శుక్రవారం ఉదయం శ్రీవారిని దర్శించుకుని అనంతరం
తిరిగి మధ్యాహ్నం 2 గంటలకు తిరుమల నుండి బయలుదేరి రేణిగుంట విమానాశ్రయం చేరుకొని తిరుగుప్రయాణం కానున్నారని తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ వారు ప్రత్యేక డాక్టర్లు, అధునాతన లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ ఏర్పాట్లు చేయాలని వైద్యశాఖ అధికారులను ఆదేశించారు, ఫైర్ సేఫ్టీ,శానిటేషన్, కాన్వాయ్ వాహనాలు తదితరాల ఏర్పాటు పై సమీక్ష నిర్వహించారు. విధులు కేటాయించిన అధికారులు ఎలాంటి అలసత్వం లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో ఏఎస్పీ లు రవిమనోహర్చారి,బి.నాగభూషన్ రావ్, ఆర్డీవో శ్రీకాళహస్తి భాను ప్రకాష్ రెడ్డి, డిఎంహెచ్ఓ బాలాజీ నాయక్, , జిల్లా ఫైర్ అధికారి రమణయ్య, ఎయిర్పోర్ట్ అధికారులు,తహశీల్దార్ సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *