Breaking News

అసంపూర్తి ఇళ్లకు అదనపు ఆర్థిక సహాయం

-కోరుకొండ మండలం పరిధిలో 89 మంది లబ్దిదారులు అంగీకారం
-ఎస్ సి, బి సి లకు రూ.50,000/- మరియు ఎస్ టి లకు రూ.75,000/- ఆర్ధిక సహాయం
-హౌసింగ్ ఏ ఈ కే. వెంకటేశ్వర రావు

కోరుకొండ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్ర -2047 విజన్ సాకారం లో భాగముగా 2029 నాటికి ” అందరికీ ఇల్లు “ కార్యక్రమంలో ఎస్ సి, బి సి లకు రూ.50,000/- మరియు ఎస్ టి లకు రూ.75,000/-  అదనపు ఆర్ధిక సహాయం అందించనున్నట్లు హౌసింగ్ సహాయ ఇంజనీర్ కే. వెంకటేశ్వర రావు తెలియ చేశారు. మంగళవారం కోరుకొండ మండలం పరిధిలో గాడాల గ్రామంలో పలువురు లబ్దిదారులను కలిసి అవగాహనా కల్పించడం జరిగింది.

ఈ సందర్భంగా ఏ ఈ – కే.వెంకటేశ్వర రావు మాట్లాడుతూ, కోరుకొండ మండలం పరిధిలో 517 మంది గృహ లబ్దిదారులు ఇంటి నిర్మాణం చేపట్టవలసి ఉందన్నారు. వారికీ ప్రభుత్వం అదనంగా అందిస్తూన్న  ఆర్ధిక సహాయం గురించి అవగాహనా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. కోరుకొండ  మండలం పరిధిలో 517 మంది లబ్దిదారులు ఉండగా ఇప్పటి వరకూ 123 మందికి సమాచారం అందించి, వారిలో 120 మందిని నేరుగా వారిని కలవడం జరిగిందన్నారు. వారిలో ఇంటి నిర్మాణం కోసం 89 మంది లబ్దిదారులు గృహ నిర్మాణం కోసం ఆసక్తీ చూపినట్లు తెలిపారు. మే నెలాఖరు నాటికి ఇంటి నిర్మాణం పూర్తి చేసేలా అవగాహనా కల్పించినట్లు తెలిపారు.  స్వర్ణాంధ్ర -2047 విజన్ సాకారం లో భాగముగా 2029 నాటికి ‘అందరికీ ఇల్లు “ ఏర్పరచాలనే దృఢనిశ్చయంతో ప్రభుత్వం వారు చర్యలు తీసుకోవడం జరుగుతున్నట్లు కలక్టర్ ప్రశాంతి తెలిపారు. మే నెలాఖరు నాటికి జిల్లా వ్యాప్తంగా  21,584 మంది లబ్దిదారులు ఉండగా, ఈ ఏడాది మే నెలాఖరు నాటికి 6 వేల గృహ నిర్మాణాల లక్ష్యాన్ని అనుసరించి ఇప్పటి వరకు 3950 మందిని కలవగా వారిలో 3,147 మంది ఇంటి నిర్మాణం చేపట్టేందుకు ముందుకు రావడం అభినందనీయం అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఎస్సి ఎస్టీ బీసీ, ఇతర వెనుకబడిన తరగతుల కేటగిరి కింద ఉన్న గృహ లబ్దిదారుల అసంపూర్తి గా ఉన్న ఇంటి నిర్మాణం కోసం అదనపు ఆర్ధిక సహాయం అందజేయడం పట్ల కృతజ్ఞతలు వ్యక్తం చేశారు.  ప్రభుత్వము అందిస్తున్న లక్షా ఎనభై వేలకి అందనంగా మరికొంత ఇచ్చి తమ సొంత ఇంటి కల సాకారం చెయ్యడం పట్ల గాడాల కి చెందిన ఎస్సి లబ్దిదారులు పైడిమల్ల రత్నం , పైడిమల్ల ధనరాజు లు ఆనందం వ్యక్తం చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *