-వైద్య వృత్తి సేవాభావంతో ముడిపడి ఉంది
-జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
వైద్య విద్యార్థులు పట్టుదల తో చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని, వైద్య వృత్తి సేవాభావంతో ఉండాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి అన్నారు. మంగళవారం ఉదయం స్థానిక మెడికల్ కాలేజీ లో ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రశాంతి ముఖ్యఅతిథిగా పాల్గొని , జ్యోతి ప్రజ్వలన చేయడం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ గత సంవత్సరం వైద్య విద్యార్థులు 99 శాతం ఉత్తీర్ణత సాధించడం శుభ పరిణామం అని తెలిపారు. వైద్య విద్యార్థులు కష్టపడి చదువుకొని వైద్యులు గా అయిన తరువాత అంకితభావం తో, ప్రజలకు సేవ చేయాలని తెలిపారు. వైద్య వృత్తి నోబెల్ ప్రొఫెషన్ అని కలక్టర్ కొనియాడారు. వైద్య విద్యార్థులు కష్టపడి చదువుకుంటూ బాధ్యతలు తెలుసు కుంటూ వైద్య సేవలు అందించేందుకు నైపుణ్యం పెంచుకోవాలని తెలిపారు.
ఈ సందర్భంగా “సౌభాగ్య రక్త మిత్ర” లోగోను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. ఒకరు రక్తాన్ని దానం చేయడం వల్ల ముగ్గురికి ప్రాణ దానం చేయవచ్చని తెలిపారు. వైద్యా ధికారులు, వైద్య విద్యార్థులచే రక్తదాన ప్రతిజ్ఞ చేయించారు. సౌభాగ్య రక్త మిత్ర అభివృద్ధి చెంది ప్రజలకు స్వచ్ఛందంగా రక్తదానం చేసి ప్రాణదాతలుగా మారాలని తెలిపారు. సేవలు అందించాలని తెలిపారు. వైద్య విద్యార్థులు మంచి మంచి వై ద్యాధికారులగా తయారయ్యి ప్రజలకు సేవ చేయాలని సూ చించారు. స్పోర్ట్స్ వీక్ లో క్రీడల్లో పాల్గొని గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ మె డికల్ కాలేజ్, ప్రిన్సిపల్, అడిషనల్ డీఎంఈ డాక్టర్ బి.సౌభాగ్య లక్ష్మి, జి జి హెచ్ ప్రభుత్వ ఆస్పటల్ సూపరింటెండెం ట్, డాక్టర్ ఎం. సూర్య ప్రభ, వైస్ ప్రిన్సిపల్, కే. శివప్రసాద్, అసిస్టెంట్ డైరెక్టర్ కే
సూర్యా రావు, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వి వి దుర్గా ప్రసాద్, ఆర్గనైజింగ్ టీం, డాక్టర్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News