రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీ సత్యసాయి డ్రింకింగ్ వాటర్ వర్కర్స్ యూనియన్ పురుషోత్తపట్నం ఉద్యోగులు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి వారి సూచనలు మేరకు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మా సమస్య పట్ల సానుకూలంగా స్పందించి, బుధవారం అమరావతిలో చర్చ లకి పిలిచిన నేపధ్యంలో బేషరతుగా సమ్మే విరమించడం జరుగుతోందని సంఘా నాయలుకు అధ్యక్షులు కట్టమూరి వీరబాబు, జనరల్ సెక్రటరీ ఉందుర్తి ఇస్సాక్ లు తెలియ చేశారు. స్థానిక జిల్లా ఆర్ డబ్ల్యూ ఎస్ కార్యాలయ ప్రాంగణంలో విలేఖరుల సమావేశంలో వివరాలు తెలియ చేశారు.
శ్రీ సత్యసాయి డ్రింకింగ్ వాటర్ వర్కర్స్ యూనియన్ పురుషోత్తపట్నం , సిఐటియు అనుబంధం సంఘం నిరవధిక సమ్మె డిమాండ్లు 21 నెలలుగా పెండింగ్లో ఉన్న జీతాలు వెంటనే చెల్లించాలని , పిఎఫ్, ఈఎస్ఐ కంటిన్యూ , పే స్లీప్
జారీ , ఉద్యోగ భద్రత, ఔట్సోర్సింగ్ లో, ప్రతి నెల పదోవ తేదీలోపు జీతాలు చెల్లించాలనే అంశాల ఆధారంగా సోమవారం నుంచి సమ్మె ప్రకటించడం జరిగింది. ఈ నేపధ్యంలో జిల్లా కలెక్టర్ యునియన్ నాయకులతో స్ధానిక కలక్టర్ క్యాంపు కార్యాలయంలో చర్చించి , ప్రభుత్వ పరంగా నిర్ణయాన్ని తెలియ చేయడం జరిగింది.
ఈ విషయమై ఆర్డబ్ల్యూఎస్ సూపరిండెంట్ ఇంజనీరు బీవిగిరి మరో దఫా దీక్ష శిబిరం వద్ద ఈ విషయాన్ని ప్రస్తావించి, సమ్మె విరమణ చేయవలసినదిగా మీ సమస్య పరిష్కారం కోసం కృషి చేయనున్నట్లు తెలిపారు. బుధవారం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వద్ద సమావేశం లో సమస్య పరిష్కారం దిశగా వెళ్లనున్నట్లు తెలిపారు.
Prajavartha Online Telugu News