-సమ్మె విరమణ కు అంగీకరించిన ఉద్యోగులు
-బుధవారం ఉప ముఖ్యమంత్రి సమక్షంలో చర్చలకు ఆహ్వానం
-ఈరోజు (మంగళవారం) రాత్రి నుంచి త్రాగునీటి సరఫరా కు అంగీకరించిన ఉద్యోగులు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
పురుషోత్తమ పట్నం శ్రీ సత్యసాయి త్రాగునీరు యూనియన్ ఉద్యోగుల సమస్య పట్ల ప్రభుత్వానికి ప్రత్యేక నివేదిక సమర్పించడం జరిగిందని, మీ సమస్య పై పూర్తి అవగాహనా ఉందని తప్పనిసరి గా పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఈ విషయమై సానుకూలంగా , వ్యక్తీగతంగా స్పందించినట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. స్థానిక జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మంగళవారం శ్రీ సత్యసాయి డ్రింకింగ్ వాటర్ వర్కర్స్ యూనియన్ పురుషోత్తపట్నం ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో కలక్టర్ సమావేశం నిర్వహించారు .
అనంతరం సాయంత్రం స్థానిక లాలా చెరువు జిల్లా ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయం వద్ద విలేఖరుల సమావేశంలో పురుషోత్తమ పట్నం శ్రీ సత్యసాయి త్రాగునీరు యూనియన్ ఉద్యోగ సంఘాల నాయకులు సమ్మె విరమణ ప్రకటన చెయ్యడం జరిగింది.
ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, మీ సమస్య పరిష్కారం కోసం ఉప ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి సానుకూలత వ్యక్తం కావడం, ఒక నెల జీత భత్యాల చెల్లింపు కు అవసరమైన రూ.10 లక్షలు చెల్లించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. వేసవి దృష్ట్యా త్రాగునీరు సరఫరా విధానం ఎటువంటి ఆటంకం ప్రజలకి త్రాగునీరు సరఫరా ఇబ్బందులు లేకుండా చూడాలని కలక్టర్ కోరారు. స్థానిక సంస్థలతో విలీనం చేయడం వల్ల నిధుల కేటాయింపు సాధ్యం అవుతుందని తెలిపారు. ఆమేరకు చర్యలు తీసుకోవాలని ప్రత్యేక ప్రతిపాదనలు పంపామన్నారు. ప్రభుత్వము మీ విషయంలో సానుకూలంగా స్పందించిన దృష్ట్యా సమ్మె విరమణ చేయవలసినదిగా కలక్టర్ ప్రశాంతి కోరారు.
ఉద్యోగ సంఘాల నాయకులు స్పందన.. సమ్మె విరమణ పై ప్రకటన:
శ్రీ సత్యసాయి డ్రింకింగ్ వాటర్ వర్కర్స్ యూనియన్ పురుషోత్తపట్నం ఉద్యోగులు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి వారి సూచనలు మేరకు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మా సమస్య పట్ల సానుకూలంగా స్పందించి, బుధవారం అమరావతిలో చర్చ లకి పిలిచిన నేపధ్యంలో బేషరతుగా సమ్మే విరమించడం జరుగుతోందని సంఘా నాయలుకు అధ్యక్షులు కట్టమూరి వీరబాబు, జనరల్ సెక్రటరీ ఉందుర్తి ఇస్సాక్ లు తెలియ చేశారు.
ఈ విషయమై ఆర్డబ్ల్యూఎస్ సూపరిండెంట్ ఇంజనీరు బీవిగిరి మరో దఫా దీక్ష శిబిరం వద్ద ఈ విషయాన్ని ప్రస్తావించి, సమ్మె విరమణ చేయవలసినదిగా మీ సమస్య పరిష్కారం కోసం కృషి చేయనున్నట్లు తెలిపారు. బుధవారం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వద్ద సమావేశం లో సమస్య పరిష్కారం దిశగా వెళ్లనున్నట్లు తెలిపారు.
Prajavartha Online Telugu News