-డి ఈ పి వో – సిహెచ్ లావణ్య
రాజమహేంద్రవరం రూరల్, నేటి పత్రిక ప్రజావార్త :
నాటు సారా నిర్మూలనకై ప్రభుత్వం ఏర్పాటుచేసిన నవోదయం 2.0 కార్యక్రమం లో భాగంగా మంగళవారం రాజమహేంద్రవరం రూరల్ మండలం వెంకటనగరం గ్రామము నందు అవగాహన సదస్సు కార్యక్రమం జిల్లా ఫోహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి సిహెచ్ లావణ్య ఆద్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగినది. ఈ సందర్భంగా జిల్లా ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి సిహెచ్. లావణ్య మాట్లాడుతూ, నాటు సారా వినియోగం వల్ల ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుందని, సారా కు బానిసలు కాకుదని విజ్ఞప్తి చేశారు. నాటు సారా తయారు చెయ్యడం, వినియోగించడం కు సంబంధించి ఏ బి సి కేటగిరి గ్రామాలను గుర్తించడం జరిగిందన్నారు. ఆమేరకు ఎక్కువ మొత్తంలో నాటు సారా తయారీ, వినియోగం ఉండడం వల్ల వెంకట నగరం గ్రామాన్ని ఏ కేటగిరి కింద గుర్తించినట్లు తెలిపారు. నాటు సారా త్రాగడం వల్ల జరిగే అనర్ధాలు గురించి అవగాహన కల్పించడం జరుగుతున్నట్లు తెలిపారు. నాటు సారా అమ్మకాలు తయారీ స్థావరాలు వివరములు తెలియచేయాలని, తెలిపిన వారి వివరములు గోప్యంగా ఉంచబడతాయని తెలిపినారు. కావున బాధ్యత కలిగిన పౌరులుగా వాటి వివరాలు తెలియ చేయడం సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం నందు అసిస్టెంట్ కమిషనర్ ఎమ్ శివ ప్రసాద్ , రాజమహేంద్రవరం నార్త్ ఇన్స్పెక్టర్ ఆర్. త్రినాధ్ , సబ్ ఇన్స్పెక్టర్ లు , సిబ్బంది, గ్రామ పెద్దలు, యువకులు, మహిళా పోలీస్, పంచాయతీ , హెల్త్ డిపార్ట్మెంట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News