Breaking News

ఒకేషనల్ పబ్లిక్ పరీక్షలకు 767 మంది విద్యార్థులు హాజరు: ఆర్.ఐ. ఓ

-నేడు జరిగిన ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ – II, లాజిక్ పేపర్ – II, బ్రిడ్జి కోర్స్ మాథ్స్ పేపర్ – II మరియు ఒకేషనల్ పబ్లిక్ పరీక్షలకు 767 మంది విద్యార్థులు హాజరు: ఆర్.ఐ. ఓ

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో నేడు జరుగుతున్న ఇంటర్మీడియట్ రెండవ సంవత్సర పబ్లిక్ పరీక్షలు మంగళవారం ప్రశాంతంగా జరిగాయని, ఈ రోజు జరిగిన పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 767 మంది విద్యార్థులు హాజరయ్యారని ఆర్.ఐ. ఓ జీ.వి.ప్రభాకర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. తిరుపతి జిల్లా వ్యాప్తంగా 01 జనరల్, 12 ఒకేషనల్ , 01 జనరల్ బ్రిడ్జి కోర్స్ కేంద్రాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కెపబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ – II, లాజిక్ పేపర్ – II, బ్రిడ్జి కోర్స్ మాథ్స్ పేపర్ – II మరియు ఒకేషనల్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షకు జనరల్ 36 మంది, ఒకేషనల్లో 795, బ్రిడ్జి కోర్స్ 9 మంది మొత్తం 840 మంది విద్యార్థులు హాజరవ్వాల్సి ఉండగా జనరల్లో 1 , ఒకేషనల్లో 63 మంది, బ్రిడ్జి కోర్స్ 9 మొత్తం 73 మంది పరీక్షకు గైర్హాజరయ్యారని తెలిపారు. పరీక్షా కేంద్రాలలో త్రాగు నీటి వసతి, పోలీసు బందోబస్తు, మెడికల్ క్యాంపు, సీసీ కెమెరాల ఏర్పాటుతో పర్యవేక్షణ, విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు వెళ్లేందుకు వీలుగా బస్సుల సౌకర్యం కల్పించామని ఆర్.ఐ. ఓ ఆ ప్రకటనలో తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *