Breaking News

వడ దెబ్బ అవగాహన గురించిన బ్యానర్స్, పోస్టర్స్ ను ఆవిష్కరించిన జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ బాలకృష్ణ నాయక్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజలందరూ వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ బాలకృష్ణ నాయక్ తెలిపారు. బుదవారం జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి ఛాంబర్ నందు వడ దెబ్బ అవగాహన గురించిన బ్యానర్స్, పోస్టర్స్ ను జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ బాలకృష్ణ నాయక్ ఆవిష్కరించారు.

జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి మాట్లాడుతూ.. వేసవి దృష్ట్యా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నందున ప్రజలందరూ వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఎండ వేళ ఇంటి పట్టునే ఉండాలని బయటికి వెళ్ళాల్సి వస్తే గొడుగు, టోపి, తలపాగా వంటివి తలకు రక్షణ గా ధరించాలని సూచించారు. ద్రవ పదార్థాలు, పళ్ళరసాలు, ఉప్పు కలిపిన మజ్జిగ, ఓఆర్ఎస్ ద్రావణం వంటివి అధికంగా తీసుకోవాలని తెలిపారు. నీరసం, కళ్ళు తిరగడం, తల నొప్పి, వాంతులు వంటి వడ దెబ్బ లక్షణాలు ఉంటే అటువంటి వంటి వారిని చల్లటి ప్రదేశం లో ఉంచి వారిని వీలైనంత తొందరగా దగ్గర లోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి తరలించాలని తెలిపారు. ముఖ్యం గా చిన్న పిల్లలు, వృద్ధులు, గర్భిణులు, దీర్ఘ రోగాలతో బాధపడేవారు( హై రిస్కు) వడ దెబ్బ కు గురికాకుండా అప్రమత్తం గా ఉండాలని హెచ్చరించారు.

ఈ కార్యక్రమం లో జిల్లా ఇమ్యునైజేషన్ ఆఫీసర్ డాక్టర్ శాంత కుమారి, డిప్యూటి డిఎమ్‌ హెచ్ఓ డాక్టర్ మురళీ కృష్ణ, జిల్లా మలేరియా అధికారి డాక్టర్ రూప్ కుమార్, జిల్లా అంధత్వ నివారణ అధికారి డాక్టర్ మధు బాబు, ఎపిడెమి లాజిస్ట్ డాక్టర్ లావణ్య, డిప్యూటి డెమో కిరణ్ కుమార్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *