Breaking News

ప్రతి మహిళా చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి

విజయవాడ,నేటి పత్రిక ప్రజావార్త :
సమాజంలో ప్రతి మహిళ చట్టాలపై సమగ్రంగా అవగాహన కలిగి ఉండాలని ప్రొడక్షన్ ఆఫీసర్ నాన్ ఇన్స్టిట్యూషనల్ కేర్ (పోనిక్) ప్రతినిధి జాన్సన్ అన్నారు. బేటి బచావో బేటి పడావో కార్యక్రమంలో భాగంగా స్థానిక సింగ్ నగర్ లోని 59 వ డివిజన్ అర్బన్ హెల్త్ సెంటర్ పరిధిలో సోమవారం మహిళలు, బాలల చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య ముఖ్య అతిథిగా హాజరైన పోనిక్ ప్రతినిధి జాన్సన్ మాట్లాడుతూ మహిళలు, చిన్నారులు వృద్ధులకు ప్రత్యేకంగా చట్టాలను ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయని అన్నారు. ఒకసారి చట్టం ద్వారా బాలికలు చిన్నారులు మహిళలపై ఎటువంటి అఘాయిత్యాలకు ఒడిగట్టిన వారిని కఠినంగా శిక్షించేందుకు ఫోక్సో చట్టం ఉందన్నారు. చట్టాలపై ప్రతి మహిళ పూర్తి అవగాహన కలిగి ఉండాలని ఆయన అన్నారు. ఉమెన్ హెల్ప్ లైన్ 181, చైల్డ్ హెల్ప్ లైన్ 1098, ఉమెన్ ట్రాఫికింగ్ తదితర చట్టాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పీహెచ్ సి డాక్టర్ సూజన్, ఐసిడిఎస్ సూపర్వైజర్ వి. విజయ్, ఏఎన్ఎం, ఆశ వర్కర్లు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *