-తొలి రోజు పరీక్షకు 98.27 శాతం మంది హాజరు
విజయవాడ,నేటి పత్రిక ప్రజావార్త :
ఏపీలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో భాగంగా ఫస్ట్ లాంగ్వేజ్ పరీక్షలు తొలి రోజు ప్రశాంతంగా జరిగాయని పాఠశాల విద్య సంచాలకులు విజయ్ రామరాజు.వి IAS., గారు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 6,27,277 మంది విద్యార్థులకు గానూ 6,16,451 మంది విద్యార్థులు హాజరు కాగా, 10,826 మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. 3,450 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు జరుగుతుండగా 1545 కేంద్రాలను ఫ్లయింగ్ స్క్వాడ్లు తనిఖీ చేశారని తెలిపారు. ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లాలో ఇద్దరు విద్యార్థులు కాపియింగ్ కు పాల్పడ్డారని, ఆ ఇద్దరిని డిబార్ చేసినట్లు పాఠశాల విద్య సంచాలకులు విజయ్ రామరాజు.వి IAS., తెలిపారు.
Prajavartha Online Telugu News