Breaking News

అత్యంత పార‌ద‌ర్శ‌కంగా మైనింగ్ కార్య‌క‌లాపాలు

– ఆరోప‌ణ‌ల‌పై స‌మ‌గ్ర విచార‌ణ‌కు ప్ర‌త్యేక క‌మిటీలు
– నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవు
– జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌

విజయవాడ,నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో అత్యంత పార‌ద‌ర్శ‌కంగా నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా మైనింగ్ కార్య‌క‌లాపాలు జ‌రిగేలా ప‌టిష్ట ప‌ర్య‌వేక్ష‌ణ‌తో నిరంత‌ర అప్ర‌మ‌త్త‌త‌తో వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ సోమవారం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.
ఇసుక లేదా మట్టి ర‌వాణాకు సంబంధించి వ‌చ్చే ఆరోప‌ణ‌లపై స‌మ‌గ్ర విచార‌ణ జ‌రిపి నివేదిక‌ల స‌మ‌ర్ప‌ణ‌కు ప్ర‌త్యేక క‌మిటీలు ఏర్పాటు చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. జి.కొండూరు మండ‌లం, కోడూరు గ్రామ కొత్త చెరువుతో పాటు చిన నందిగామ వ‌ద్ద డంప్ నుంచి ఇసుక అక్ర‌మ ర‌వాణా జ‌రుగుతున్న‌ట్లు వ‌చ్చిన ఆరోపణలపై ఏపీఎస్‌సీఎస్‌సీ లిమిటెడ్ డీఎం, మైన్స్ డీడీ, విజ‌య‌వాడ రూర‌ల్ త‌హ‌సీల్దార్‌, మైల‌వ‌రం మండ‌లం స‌ర్వేయ‌ర్‌, సంబంధిత వీఆర్‌వోల‌తో క‌మిటీ ఏర్పాటు చేసిన‌ట్లు తెలిపారు. అదేవిధంగా జ‌గ్గ‌య్య‌పేట మండ‌లం, కొంగ‌ర మ‌ల్ల‌య్య‌గ‌ట్టు వ‌ద్ద అక్ర‌మ క్వారీయింగ్ ఆరోప‌ణ‌ల‌పైనా క‌మిటీ ఏర్పాటు చేసిన‌ట్లు తెలిపారు. ఏపీఎస్‌సీఎస్‌సీ లిమిటెడ్ డీఎం, మైన్స్ డీడీ, విజ‌య‌వాడ రూర‌ల్ త‌హ‌సీల్దార్‌, మైల‌వ‌రం మండ‌లం స‌ర్వేయ‌ర్‌, సంబంధిత వీఆర్‌వోల‌తో క‌మిటీ ఏర్పాటు చేసిన‌ట్లు వెల్ల‌డించారు. నిర్దేశ ప్రాంతాల్లో ప‌టిష్ట నిఘాకు కూడా ఈ క‌మిటీలు ప‌నిచేస్తాయ‌ని వెల్ల‌డించారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా అక్రమ తవ్వకాలు లేదా రవాణాకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ లక్ష్మీశ హెచ్చరించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *