Breaking News

Daily Archives: April 11, 2025

టెంపుల్ టూరిజంగా ఒంటిమిట్టను అభివృద్ధి చేస్తాం

-రామ పాలన అందించి రామరాజ్యం తేవాలన్నదే నా ఆకాంక్ష -ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు -ఒంటిమిట్టలో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవంలో పాల్గొని పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు దంపతులు -కన్నుల పండువగా కళ్యాణోత్సవం…తరలివచ్చిన భక్తజనం ఒంటిమిట్ట, నేటి పత్రిక ప్రజావార్త : ఒంటిమిట్టను టెంపుల్ టూరిజంగా అభివృద్ధి చేస్తామని, ఇక్కడికి వచ్చే భక్తులు రెండు మూడు రోజులు ఉండేలా సదుపాయాలు కల్పిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. కడప జిల్లా, ఒంటిమిట్టలో జరిగిన శ్రీసీతారాముల కళ్యాణోత్సవంలో సీఎం చంద్రబాబు దంపతులు పాల్గొని స్వామివార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు. …

Read More »

బీసీ మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం సమావేశం జరిగింది. శుక్రవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో జరిగిన సమావేశంలో రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షులుగా షేక్ నాగుల్ మీరాను నియమించి ఆయనకు నియమాకపత్రాన్ని అందజేశారు. నాగుల్ మీరా మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన లాకా వెంగళరావు యాదవ్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. సమావేశానికి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు చప్పిడి కృష్ణమోహన్ ముదిరాజ్ సమన్వయకర్తగా వ్యవహరించాడు. ఈ సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లాకా వెంగళరావు …

Read More »

వైసీపీ నేతల అరాచకాలపై గ్రీవెన్స్ లో బాధితులు ఫిర్యాదు

-అర్జీలు ఇచ్చి తమకు న్యాయం చేయాలంటూ విన్నపం -అర్జీలు స్వీకరించి సమస్యల పరిష్కారానికి కృషి చేసిన నేతలు గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి గురుమూర్తి, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మెన్ డూండి రాకేష్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పల్నాడు జిల్లా పిడుగురాళ్లకు చెందిన ఓ బాధితురాలు గ్రీవెన్స్ లో నేతలకు అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ… తాను మాతా శిశుసంక్షేమ శాఖలో అంగన్ వాడీ హెల్పర్ గా విధులు నిర్వహిస్తున్నానని.. తాను పనిచేస్తున్న స్కూల్ లో అంగన్ వాడీ టీచర్ కు ప్రమోషన్ …

Read More »

సీతా రామ కళ్యాణం దర్శించడం మన అదృష్టం

-మీ భక్తిని చూసి ఆకర్షితుడినయ్యాను -వొంటిమిట్టను దేవాలయ పర్యాటక హబ్‌గా అభివృద్ధి చేస్తాం -కొండలపై ఆయుర్వేద మొక్కల పెంపకం -తిరుమలలో గోవింద నామం మాదిరిగా వొంటిమిట్టలో ‘జై శ్రీరామ్’ నినాదమే ప్రతిధ్వనించాలి -వొంటిమిట్టలోనూ త్వరలో అన్నప్రసాదం ప్రారంభం -శ్రీరాముడు పవిత్ర కుటుంబ సంబంధాలకి ఆదర్శం -శ్రీరాముని వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలి -రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వొంటిమిట్ట, నేటి పత్రిక ప్రజావార్త : కడప జిల్లాలోని వొంటిమిట్టలో జరిగిన భవ్యమైన సీతా రామ కళ్యాణ మహోత్సవం ముగిసిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా …

Read More »

శ్రీ సీతారాముల క‌ల్యాణంలో శ్రీ‌రామ గానామృతంతో మైమ‌రిచిన భ‌క్తులు

ఒంటిమిట్ట, నేటి పత్రిక ప్రజావార్త : ఒంటిమిట్ట శ్రీ సీతారాముల క‌ల్యాణోత్స‌వం సంద‌ర్భంగా శుక్ర‌వారం సాయంత్రం 5.30 గంట‌ల‌కు బెంగూళూరుకు చెందిన స్ఫూర్తి రావు ఆల‌పించిన శ్రీ‌రామ గానామృతంతో భ‌క్తులు త‌న్మ‌య‌త్వం చెందారు. అంత‌కుముందు తిరుప‌తి ఎస్వీ సంగీత నృత్య క‌ళాశాల విద్యార్థులు ” శ్రీ‌రామ వైభ‌వం ” పై నృత్య రూప‌కం ప్ర‌ద‌ర్శించారు. ఇందలో విశ్వ‌మిత్ర మ‌హ‌ర్షి యాగ ర‌క్ష‌ణార్థం రామ‌ల‌క్ష్మ‌ణుల‌ను అశ్ర‌మానికి తీసుకువెళ్ళ‌డం, అక్క‌డ రాక్ష‌సుల‌ను సంహ‌రించ‌డం ప్ర‌ద‌ర్శించారు. అనంత‌రం సీతా రాముల క‌ల్యాణం కథను చక్కగా భక్తి భావంతో ప్రదర్శించిన …

Read More »

ఒంటిమిట్ట శ్రీ కోదండరాముడి సేవలో ‘శ్రీవారి సేవకులు’

ఒంటిమిట్ట/తిరుప‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు విచ్చేసే లక్షలాదిమంది భక్తులకు శ్రీవారి సేవకులు విశేష సేవలందిస్తున్నారు. సాధారణ రోజులలో కడప, రాజంపేట, ప్రొద్దుటూరు, రాయచోటి నుండి దాదాపు వెయ్యమంది, ఏప్రిల్ 11వ తేదీ శ్రీ సీతారాముల కల్యాణం సందర్భంగా ఎండ వేడిని కూడా లెక్క‌చేయ‌కుండా 2,500 మందికి పైగా శ్రీవారి సేవకులు సేవలందించారు. ఏప్రిల్ 11వ తేదీ శ్రీసీతారాముల కల్యాణానికి విచ్చేసే లక్షలాదిమంది భక్తులకు అందజేసేందుకు పిఏసిలో అక్షింతలు, ముత్యం, కంకణం కలిపి ప్యాక్ చేశారు. అదేవిధంగా …

Read More »

కూటమి ప్రభుత్వానిది సుపరిపాలన

-ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకున్నామనే నమ్ముతున్నా -పూలే స్ఫూర్తితో సంక్షేమ పాలన సాగిస్తున్నాం -సంక్షేమంలో బీసీలకు అత్యధిక ప్రాధాన్యత -సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తే సహించం -చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేస్తాం -నూజివీడు నియోజకర్గంపై ప్రత్యేక శ్రద్ధ -ఆగిరిపల్లి ప్రజావేదికలో ముఖ్యమంత్రి చంద్రబాబు -ఘనంగా పూలే జయంతి వేడుకలు నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో సుపరిపాలన అందించేది కూటమి ప్రభుత్వం మాత్రమేనని, నాపైన ప్రజలు ఉంచిన నమ్మకాన్ని నిలబెడతాననే విశ్వాసం ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు …

Read More »

నేటి బంగారు కుటుంబాలే…రేపటి మార్గదర్శులు

-సమాజంలో ఆర్థిక అసమానతలు తగ్గాలి -ఆగిరిపల్లి ‘మార్గదర్శి-బంగారు కుటుంబం’ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నూజివీడు/ఆగిరిపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న 10 శాతం మంది అట్టడుగున ఉన్న 20 శాతం పేదలను పైకి తీసుకొచ్చేందుకు ముందుకు రావాలని సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి పిలుపునిచ్చారు. పేద కుటుంబాల్లో వెలుగు తెచ్చేవరకు అండగా ఉంటానని, నేడు బంగారు కుటుంబానికి ఎంపికైన వారి పిల్లలే సహకారం అందిస్తే రేపు మార్గదర్శుకులుగా తయారుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. సమాజంలో ప్రజల మధ్య ఆర్థిక …

Read More »

టిడ్కో కాల‌నీల్లో ఎంఎస్ఎంఈ యూనిట్ల‌తో మ‌హిళ‌ల‌కు జీవ‌నోపాధి

-163 ప్రాంతాల్లో జీవ‌నోపాధి కేంద్రాల ద్వారా మ‌హిళ‌ల‌కు శిక్ష‌ణ‌,స్వ‌యం ఉపాధి కల్ప‌న‌ -ఈ ఏడాది ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో 30 వేల మంది మ‌హిళా పారిశ్రామిక వేత్త‌ల‌ను త‌యారుచేయ‌డ‌మే ల‌క్ష్యం -ఎంఎస్ఎంఈ యూనిట్ల అధ్య‌య‌నానికి హైద‌రాబాద్ లో మంత్రి నారాయ‌ణ బృందం ప‌ర్య‌ట‌న‌ -ప్ర‌గ‌తి న‌గ‌ర్ లో ఎలీప్ ఎంఎస్ఎంఈ ఇండ‌స్ట్రియ‌ల్ పార్క్ సంద‌ర్శ‌న‌ అమ‌రావ‌తి/హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో నివ‌సించే మ‌హిళ‌ల‌కు సుస్ధిర జీవ‌నోపాధి క‌ల్పించేందుకు ఏపీ మున్సిప‌ల్ శాఖ వేగంగా అడుగులు ముందుకు వేస్తుంది…ఈ ఏడాది రాష్ట్రంలో …

Read More »

మహాత్మా జ్యోతిబా పూలే సమాజానికి అందించిన సేవలు మరువలేనివి : సిఎస్ విజయానంద్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మహాత్మా జ్యోతి బా పూలే 199 వ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం విజయవాడ సిఎస్ క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్సి కె.విజయా నంద్ పూలే చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించారు. అదే విధంగా రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ముకేశ్ కుమార్ మీనా తదితర అధికారులు పాల్గొని జ్యోతిబా పూలే చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. ఈసందర్భంగా సిఎస్ విజయానంద్ మాట్లాడుతూ సమాజానికి పూలే అందించిన సేవలు ఎనలేనివని …

Read More »