Breaking News

Daily Archives: April 11, 2025

నేటి పత్రిక ప్రజావార్త :

Read More »

నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ విధానాలపై అవగాహన పెంచుకోండి..

-జాతీయ మాతృ సంరక్షణ దినోత్సవ ర్యాలీలో కలెక్టర్‌ డా.జి.లక్ష్మీశ, ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌రావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గర్భధారణ, ప్రసవం, ప్రసవానంతర కాలంలో మహిళలకు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ విధానాలను ప్రభుత్వం అందుబాటులో ఉంచిందని వాటిని తల్లులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ డా.జి. లక్ష్మీశ , శాసనసభ్యులు గద్దె రామమోహన్‌రావు అన్నారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 4 వ డివిజన్‌లో జాతీయ సురక్షిత మాతృత్వ దినోత్సవ సందర్భంగా శుక్రవారం జిల్లా కలెక్టర్‌ డా. జి. లక్ష్మీశ, శాసనసభ్యులు గద్దె రామమోహన్‌రావు …

Read More »

వెనుకబడిన వర్గాల ఆర్థిక స్వాలంబనే ప్రభుత్వ లక్ష్యం..

-స్వయం ఉపాధి ద్వారా ఆర్థిక పురోగతి సాధించాలి.. -జిల్లా కలెక్టర్‌ డా. జి. లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వెనుకబడిన వర్గాల ఆర్థిక స్వాలంబనకై ప్రభుత్వం కల్పిస్తున్న సహకారాన్ని అందిపుచ్చుకుని స్వయం ఉపాధి ద్వారా ఆర్ధిక పురోగతిని సాధించాలని జిల్లా కలెక్టర్‌ డా. జి. లక్ష్మీశ సూచించారు. మహాత్మా జ్వోతిరావు పూలే జయంతిని పురస్కరించుకుని వెనుకబడిన తరగతుల సేవా సహకార సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్‌లో లబ్దిదారులకు ఆటోలను, ఆర్థిక సహయపు చెక్కులను జిల్లా కలెక్టర్‌ డా.జి. లక్ష్మీశ పంపిణీ చేశారు. సందర్భంగా …

Read More »

సూక్ష్మ పర్యవేక్షణలో యుపిఎస్‌సి పరీక్షలను నిర్వహించండి…

-ఎటువంటి లోటు పాట్లకు తావులేకుండా పరీక్షలను నిర్వహించాలి.. -అభ్యర్థులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయండి.. -జిల్లా కలెక్టర్‌ డా. జి. లక్ష్మీశ విజయవాడ,  నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 13 వ తేదీ ఆదివారం నిర్వహించనున్న నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ, నావెల్‌ అకాడమీ, కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌ పరీక్షలను సూక్ష్మ పర్యవేక్షణలో నిర్వహించాలని ఎటువంటి లోటు పాట్లకు తావులేకుండా పరీక్షల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను చేయాలని జిల్లా కలెక్టర్‌ డా. జి.లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సి) …

Read More »

మహాత్మా జ్వోతిరావు పూలే సిద్దాంతాలు ఆదర్శప్రాయం..

-జిల్లా కలెక్టర్‌ డా. జి. లక్ష్మీశ  విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సమ సమాజ స్థాపనకు అహర్నిశలు కృషి చేసిన సంఘ సంస్కర్త సామాజిక తత్వవేత్త మహాత్మా జ్వోతిరావు పూలేని నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ డా. జి. లక్ష్మీశ అన్నారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్‌లోని పింగళివెంకయ్య సమావేశ మందిరంలో నిర్వహించిన మహాత్మా జ్వోతిరావు పూలే 199వ జయంతి వేడుకలను పురస్కరించుకుని జ్వోతిరావు పూలే చిత్ర పటానికి జిల్లా కలెక్టర్‌ డా. జి. లక్ష్మీశ …

Read More »

ఈ-శ్రమ పోర్టల్ పోస్టర్ ఆవిష్కరణ

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : అసంఘటిత కార్మికులకు అండగా ఉండేందుకుపెట్టిన  సంక్షేమ పధకాలలో భాగంగా  ఈ-శ్రమ పోర్టల్ క్రింద గుంటూరు జిల్లాఇంఛార్జ్ కలెక్టర్ ఏ.భార్గవ్ తేజ్, IAS, ఈ-శ్రమ పోర్టల్ క్రింద డిజైన్ చేయబడిన పోస్టర్ను శుక్రవారం విడుదల చేసారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుప్రీంకోర్టు స్పెషల్లీవ్ పిటిషన్ నెం. 6/2020 తేది:29.06.2021 లో ఇచ్చిన ఆదేశాల ప్రకారం కేంద్రప్రభుత్వం అసంఘటిత రంగ- కార్మికులకు సామాజిక భద్రత కల్పించే ఉద్దేశంతో వారినమోదుకు ఈ-శ్రమ పోర్టల్ ను ప్రవేశ పెట్టినదనియు, ఈ.యస్.ఐ, ఈ.పి.యఫ్  …

Read More »

ఇ.ఎస్.ఐ సేవలను మరింత మెరుగుపరిచే దిశగా చర్యలు

-కార్మిక శాఖ అదనపు అదనపు కార్యదర్శి గంధం చంద్రుడు విజయవాడ,  నేటి పత్రిక ప్రజావార్త : ఇ.ఎస్.ఐ హాస్పిటల్‌లో అందుతున్న వైద్య సేవలను మరింత మెరుగుపర్చేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని కార్మిక శాఖ అదనపు అదనపు కార్యదర్శి గంధం చంద్రుడు స్పష్టం చేసారు. శుక్రవారం ఉదయం విజయవాడ ఇ.ఎస్.ఐ హాస్పిటల్‌ను సందర్శించిన చంద్రుడు, ఓపీ రిజిస్ట్రేషన్, లాబరేటరీ, ఇన్‌పేషెంట్, అవుట్‌పేషెంట్ విభాగాలను పరిశీలించారు. రోగుల నుంచి నేరుగా ఫీడ్‌బ్యాక్ తీసుకుని, వైద్య సేవలు మరింత ప్రభావవంతంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని వైద్య సిబ్బందికి ఆదేశాలు …

Read More »

పన్ను బకాయి చెల్లింపు గడుపు ఏప్రియల్ 30 వరకు పొడిగింపు

-ప్రభుత్వం ప్రకటించిన 50% వడ్డీ రాయితీని బకాయిదారులు వినియోగించుకోవాలి -2025-26 సంవత్సర పన్ను పూర్తిగా చెల్లించి 5% రిబేట్ పొందాలి -కేతన్ గార్గ్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : నగరపాలక సంస్థ కు సంబంధించి ఇంటిపన్ను , ఖాళీస్థలము పన్నుల బకాయి ఉన్న పన్నులు చెల్లింపు కోసం పన్ను బకాయిదారులు ఏప్రియల్ 30 వ తేదీ లోగా ఈ అవకాశాన్ని వినియోగించుకొని, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 50% వడ్డీ రాయితీని పొందాలని కమిషనరు కేతన్ గార్గ్ శుక్రవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేసారు. రాష్ట్ర …

Read More »

ప్రముఖ క్లీన్టెక్ స్టార్టప్ అయిన ఫ్రేయర్ ఎనర్జీ, ష్నైడర్ ఎలక్ట్రిక్‌తో భాగస్వామ్యం

-భారతదేశం లో స్వచ్ఛ ఇంధన మార్గాన్ని వేగవంతం చేసేందుకు ప్రముఖ క్లీన్టెక్ స్టార్టప్ అయిన ఫ్రేయర్ ఎనర్జీ, ష్నైడర్ ఎలక్ట్రిక్‌తో భాగస్వామ్యం చేసుకుంది -2026 నాటికి 25,000 ప్రోసుమర్లను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది -భారతదేశవ్యాప్తంగా ఇంటిగ్రేటెడ్ స్మార్ట్ హోమ్ మరియు సోలార్ పరిష్కారాల కోసం భాగస్వామ్యం -నివాస ఇంధన సామర్థ్యం ద్వారా జాతీయ సుస్థిరత లక్ష్యాలకు మద్దతు! అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ష్నైడర్ ఎలక్ట్రిక్, ఇంధన నిర్వహణ మరియు ఆటోమేషన్ డిజిటల్ పరివర్తనలో అగ్రగామి మరియు ఫ్రేయర్ ఎనర్జీ సర్వీసెస్ ప్రైవేట్ …

Read More »

ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వేయిల్లెన్స్ ప్రోగ్రామ్ శిక్షణా కార్యక్రమం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ వీరపాండ్యన్ ఆదేశానుసారంగా 26 జిల్లాల సర్వేయిల్లెన్స్ యూనిట్స్ సిబ్బంది కి, డాక్టర్ బి. సుబ్రమణ్యేశ్వరి, అదనపు సంచాలకులు, (డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్) వారి సమక్షంలో ఈరోజు విజయవాడ లోని సిద్ధార్థ మెడికల్ కాలేజీ అకడమిక్ లాంజ్ లో ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వేయిల్లెన్స్ ప్రోగ్రామ్ గురించి ఒకరోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆన్లైన్ లో వివరములు చేర్చుటకుగాను క్రొత్తగా వచ్చిన మార్పుల గురించి, ఎపిడెమిక్ …

Read More »