Breaking News

మహాత్మా జ్వోతిరావు పూలే సిద్దాంతాలు ఆదర్శప్రాయం..

-జిల్లా కలెక్టర్‌ డా. జి. లక్ష్మీశ 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సమ సమాజ స్థాపనకు అహర్నిశలు కృషి చేసిన సంఘ సంస్కర్త సామాజిక తత్వవేత్త మహాత్మా జ్వోతిరావు పూలేని నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ డా. జి. లక్ష్మీశ అన్నారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్‌లోని పింగళివెంకయ్య సమావేశ మందిరంలో నిర్వహించిన మహాత్మా జ్వోతిరావు పూలే 199వ జయంతి వేడుకలను పురస్కరించుకుని జ్వోతిరావు పూలే చిత్ర పటానికి జిల్లా కలెక్టర్‌ డా. జి. లక్ష్మీశ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ సామాజిక అసమానతలను రూపుమాపేందుకు సామాజిక ఉద్యమానికి అలుపెరగని పోరాటం చేశారన్నారు. జ్వోతిరావు పూలే భారతీయులంతా ఒకటే అని, సమాజంలో అసమానతలకు రూపు మాపి ప్రతి ఒక్కరూ సమానమే అనే భావనకు ఆద్యుడు జ్వోతిరావు పూలే అని అన్నారు. మానవుడికి విద్య జ్ఞాన జ్వోతిలాంటిదని మహాత్మ జ్వోతిరావు పూలే విశ్వసించేవారన్నారు. ఆయన సిద్దాంతాలను ప్రతి ఒక్కరూ అచారించాల్సిన అవసరం ఉందన్నారు. 19వ శతాబ్ధంలో ప్రెంచ్‌ ఉద్యమంలో పాల్గొని పేద బడుగు బలహీన వర్గాల కోసం అహర్నిసలు పొరాటం చేసిన వ్యక్తి జ్వోతిరావు పూలే అని అన్నారు. బడుగు, బలహీన వర్గాలలో ఆత్మస్థ్తెర్యం కల్పించి వారి హక్కుల కోసం పోరాటం చేయడంతో పాటు సాదికారత దిశగా కృషి చేసిన మహానీయుడు జ్వోతిరావు పూలే అని కలెక్టర్‌ అన్నారు. గాందీజీ కంటే ముందే మహాత్మా అని బిరుదు పొందడం ఆమన దార్శనీకతకు నిదర్శనం అన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిసలు కృషి చేసిన వ్యక్తి పూలే అని జిల్లా కలెక్టర్‌ డా. జి. లక్ష్మీశ అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి యం. లక్ష్మీ నరసింహాం, కలెక్టరేట్‌ పరిపాలన అధికారి శ్రీనివాసరరెడ్డి, జిల్లా వెనకబడిన తరగతుల సంక్షేమ అధికారిణి. కె. లక్ష్మీదేవమ్మ, సహాయ సంక్షేమ అధికారి పి. శ్రీనివాసరావు, బిసి కార్పోరేషన్‌ ఏఇవో కె. రాజేంద్రబాబు, హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్లు రజనీకుమారి, హేమప్రియ, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఉత్తరాంధ్రకు మకుటాయమానం.. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం: మంత్రి కందుల దుర్గేష్

-ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ‘అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం’ ప్రారంభోత్సవం.. ఈ సందర్భంగా ఏర్పాట్లను …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *