-జిల్లా ఎస్‌సీ సంక్షేమం, సాధికారత అధికారి కె.శ్రీనివాస శిరోమణి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఉచిత డీఎస్‌సీ కోచింగ్‌కు షార్ట్‌లిస్ట్ చేయబడిన ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థుల జాబితా https://mdfc.apcfss.in పోర్టల్‌లో ఉందని, జాబితాలోని అభ్యర్థులు ఈ నెల 28వ తేదీలోగా ఫేజ్-2 వెబ్ ఆప్షన్ సర్వీస్ ద్వారా ఎంప్యానెల్డ్ కోచింగ్ సంస్థలకు తమ ప్రాధాన్యతలు ఇవ్వాలని జిల్లా ఎస్‌సీ సంక్షేమం, సాధికారత అధికారి కె. శ్రీనివాస శిరోమణి బుధవారం ఓ ప్రకటనలో సూచించారు. వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ద్వారా అభ్యర్థులు అన్ని కోచింగ్ సంస్థలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఈ దశలో ఫేజ్-1 వెబ్ ఆప్షన్లను సవరించేందుకు వీలవదని తెలిపారు.