గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
రేపు, ఎల్లుండి ఉగాది మరియు రంజాన్ పండుగల శెలవు దినాలైనప్పటికీ యధావిధిగా పని చేయనున్నజిఎంసి ట్యాక్స్ కలెక్షన్ కౌంటర్లు… కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఆస్తి పన్ను చెల్లించటానికి ఈ నెలాఖరు వరకే (2 రోజులే) గడువు ఉన్నందున ఈ నెల 30,31 తేదీల్లో ఉగాది, రంజాన్ పండుగ సెలవు రోజులైనప్పటికీ పన్ను చెల్లింపుదారులకు సౌలభ్యంగా జిఎంసి ట్యాక్స్ కలెక్షన్ కౌంటర్లు ఉదయం 6 నుండి రాత్రి 9 గంటల వరకు పని చేస్తాయని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ఆస్తి పన్ను వడ్డీపై రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 50 శాతం రాయితీని వినియోగించుకొని పన్ను చెల్లించడానికి కేవలం 2 రోజులే గడువు ఉన్నందున, సెలవు రోజుల్లోనూ పన్ను చెల్లించడానికి వచ్చే వారికి వీలుగా ట్యాక్స్ కలెక్షన్ కౌంటర్లను అందుబాటులో ఉంచుతున్నామన్నారు. కౌంటర్ల ఉదయం 6 నుండి రాత్రి 9 గంటల వరకు పని చేస్తాయన్నారు. శనివారం ఒక్కరోజే రూ 5 కోట్లు పన్ను వసూళ్లు జరిగిందని ప్రజలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఈ వడ్డీ రాయితీతో పన్ను చెల్లించడానికి చివరి అవకాశం కనుక ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోని జిఎంసి ప్రధాన కార్యాలయం, సర్కిల్ కార్యాలయాల్లోని ట్యాక్స్ కలెక్షన్ కౌంటర్లలో పన్ను చెల్లించి, నగరాభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. అలాగే రెవెన్యూ అధికారులు, సిబ్బందికి, ట్యాక్స్ కలెక్షన్ కౌంటర్ల సిబ్బందికి కూడా ఈ 2 రోజులు సెలవులు రద్దు చేశామన్నారు.
Prajavartha Online Telugu News