గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగర పరిధిలో ప్రధాన ఔట్ఫాల్ డ్రైన్లలో పూడికతీత పనులు వేగవంతం చేసి, వెంటనే పూర్తి చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. శనివారం కమీషనర్ తమ రోజు వారీ పర్యటనలో భాగంగా విద్యానగర్, నగరాలు, గోరంట్ల, రెడ్డి పాలెం తదితర ప్రాంతాలలో పర్యటించి పారిశుధ్య పనులను మరియు ప్రధాన డ్రైన్లలో సిల్ట్ తొలగింపు పనులు మరియు భవన నిర్మాణ అనుమతులను పరిశీలించి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.
గుంటూరు నగరంలో ప్రధాన డ్రైన్లతో పాటు అంతర్గత రోడ్లలోని డ్రైన్లలోని పూడికతీత పనులు పక్కాగా నిర్వహించాలని, వీటితోపాటు తొలగింపు పనులను ప్రత్యేక డ్రైవ్ మోడ్ లో చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. రానున్న వర్షాకాలం రాకముందే నగరంలోని ప్రధాన రహదారులు మరియు అంతర్గత రోడ్లలోని డ్రైన్లలో పూర్తి స్తాయిలో పూడికతీత పనులు పూర్తి చేయాలన్నారు. పట్టణ ప్రణాళిక అధికారులతో సమన్వయం చేసుకొని, డ్రైన్జల పై ఉన్న ర్యాంపులను తొలగించి నూరు శాతం పూడికతీత జరగాలన్నారు. పనులు చేపట్టకముందు, జరిగిన పిదప ఫోటోలు మరియు స్థానికుల సంతకాల వివరాలు అంచనాలతో పొండుపరచాలన్నారు. స్థానికులకు అసౌకర్యం కలుగకుండా తొలగించిన పూడికను వెంటనే తరలించాలన్నారు. డ్రైన్ ఎండ్ వరకు పూడిక తీసేలాగా ఇంజనీరింగ్ అధికారులు ప్రత్యేక్షంగా పరిశీలించి సిఫారసు చేసిన వాటికే బిల్లుల చెల్లింపులు ఉంటాయన్నారు. సిల్ట్ తొలగింపు పనులను ఇంజనీరింగ్ మరియు ప్రజారోగ్య అధికారులు సమన్వయంతో చేయాలన్నారు. నగరంలో చెత్తకుప్పలు తొలగింపులో జాపయం జరుగుట పై ప్రజల నుండి అనేక పిర్యాదులు వస్తున్నాయని, గత వారం నుండి నైట్ శానిటేషన్ ద్వారా ప్రధాన రోడ్ల స్వీపింగ్ పనులు ప్రారంభించామని, వార్డులలో ఉన్న చేత్తకుప్పలు కనపడకుండా ఎప్పటికప్పుడు తరలించాలన్నరు. అనంతరం విద్యానగర్ లో భవన నిర్మాణ ఓ.సి లను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగర పాలక సంస్థ నుండి అనుమతి పొందిన ప్లాన్ ప్రకారమే భవన నిర్మాణాలు జరగాలని, అనుమతి పొందిన ప్లాన్ డీవియేషణ్ అయితే ఓ.సి లకు అనుమతి ఇవ్వడం జరగదన్నారు. పట్టణ ప్రణాళిక అధికారులు అనధికార నిర్మాణాలు జరగకుండా పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.
పర్యటనలో కార్పొరేటర్ కొమ్మినేని కోటేశ్వర రావు, ఏ.సి.పి రెహమాన్, యస్.యస్ లు సోమశేఖర్, ఐజాక్, టి.ఫై.యస్ లు, ఏఈలు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.
