గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
అన్నక్యాంటీన్లలో ప్రతి రోజు నిర్దేశిత సమయంలో ఆహారం అందించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ అక్షయ పాత్ర సిబ్బందికి స్పష్టం చేశారు. శనివారం నగరంలోని బస్టాండ్ వద్ద గల అన్న క్యాంటీన్ ని పరిశీలించి ఆహారం తీసుకుంటున్నవారితో మాట్లాడి సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ నిర్దేశించిన సమయానికి అన్న క్యాంటీన్లలో ఆహారం అందించాలని సిబ్బందిని ఆదేశించారు. ప్రతి రోజు అన్నా కాంటీన్ కు వచ్చే ప్రజల సంఖ్యకు అనుగుణంగా ఇండెంట్ పెంచుకోవాలని, ఏ ఒక్కరికీ ఆహారం అందలేదని ఫిర్యాదు రాకూడదన్నారు. క్యాంటీన్ కు వచ్చే ప్రజలు తమ అభిప్రాయాలను క్యాంటీన్ లోని క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా తెలియచేయవచ్చని పేర్కొన్నారు.
Prajavartha Online Telugu News