Breaking News

రాష్ట్రంలో గ్యాస్ సరఫరాకు ఇబ్బంది లేదు

-సివిల్ సప్లైస్ డైరెక్టర్ శ్రీవాస్ నూపుర్ అజయ్‌ కుమార్

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :

రాష్ట్రంలో ఎల్పీజీ, పెట్రోల్, డీజిల్, ఎరువుల నిల్వలు పుష్కలంగా ఉన్నాయని ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ శ్రీమతి నుపూర్ అజయ్ కుమార్ తెలిపారు..

స్థానిక కానూరు స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కార్యాలయంలో ప్రెస్ ఇన్ఫర్మేషన్ డైరెక్టర్ తో కలిసి నిర్వహించిన సంయుక్త ప్రెస్ మీట్ లో సోమవారం సివిల్ సప్లైస్ డైరెక్టర్ శ్రీమతి శ్రీవాస్ నూపుర్ అజయ్‌ కుమార్ మాట్లాడుతూ… రాష్ట్ర ప్రజలకు గ్యాస్ కు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని చర్యలను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందన్నారు. గ్యాస్, పెట్రోల్, డీజిల్, సరఫరా వ్యవస్థలను నిరంతరం పర్యవేక్షిస్తూ, నిల్వలు సమృద్ధిగా అందుబాటులో ఉంచుతున్నామన్నారు.
అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావం రాష్ట్రంపై ఉన్నప్పటికీ, అవసరమైన గ్యాస్ కొరత లేకుండా సరఫరా కొనసాగేందుకు సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుంటూ అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సరఫరా చైన్ లో ఎటువంటి అవకతవకలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు అనవసరంగా నిల్వలు చేసుకోవడం, అపోహలకు లోనుకావద్దని సూచించారు.

రాష్ట్రంలో వంటగ్యాస్ (LPG), పెట్రోల్, డీజిల్ మరియు ఎరువుల నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, ప్రజలు ఎటువంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదన్నారు. గ్యాస్, ఇంధన కొరత ఉందంటూ సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మవద్దని ఆమె విజ్ఞప్తి చేశారు.
ప్రస్తుతం రాష్ట్రంలోని రిఫైనరీల్లో సుమారు 14,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ నిల్వ ఉండగా, రోజువారీ వినియోగం కేవలం 4,000 మెట్రిక్ టన్నులే అని తెలిపారు. సరఫరాను 4,100 మెట్రిక్ టన్నులకు పెంచినట్లు వెల్లడించారు.
నేరుగా ఇంటికే గ్యాస్ సరఫరా వినియోగదారులు గ్యాస్ ఏజెన్సీలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా 100% హోమ్ డెలివరీ అందిస్తున్నామని తెలిపారు. వాట్సాప్, ఐవీఆర్ఎస్, మిస్డ్ కాల్ లేదా మొబైల్ యాప్‌ల ద్వారా సులభంగా సిలిండర్ బుకింగ్ చేసుకోవచ్చన్నారు. అనవసరమైన పానిక్ బుకింగ్‌లను నివారించేందుకు పట్టణాల్లో 25 రోజులు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజుల తర్వాత మాత్రమే తదుపరి బుకింగ్‌కు అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు.
అక్రమాలపై కఠిన చర్యలు
గ్యాస్ సిలిండర్ల అక్రమ దారి మళ్లింపును అరికట్టేందుకు 90% వరకు ఓటీపీ ఆధారిత డెలివరీ అమలు చేస్తున్నామని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని, మార్చి 1 నుండి ఇప్పటివరకు 1,075 కేసులు నమోదు చేసి, 4,377 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఇంధన సరఫరా సాధారణం
రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ సరఫరా సాధారణంగానే కొనసాగుతోందని, ధరల్లో ఎటువంటి మార్పులు లేవని, సరిపడా నిల్వలు ఉన్నాయని తెలిపారు.
పానిక్ బుకింగ్‌లకు దూరంగా ఉండండి తప్పుడు ప్రచారాలను నమ్మి గ్యాస్‌ను నిల్వ చేసుకోవద్దని, గ్యాస్ ఏజెన్సీల వద్ద రద్దీ సృష్టించవద్దని, అధికారిక సమాచారం కోసం మాత్రమే సంబంధిత వనరులను సంప్రదించాలని ప్రజలను కోరారు.

పిఐబి డైరెక్టర్ జి. సురేష్ కుమార్ మాట్లాడుతూ.. గత ఐదు వారాలుగా పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల ప్రభావం కొంత మేర చమురు, సహజ వాయువు సరఫరాపై ఉన్నప్పటికీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో సమర్థంగా పరిస్థితిని ఎదుర్కొంటున్నాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ చర్యలు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆధ్వర్యంలో మంత్రుల బృందం (IGM) ఏర్పాటు చేశారన్నారు.
ఏడుగురు కార్యదర్శులతో సాధికారిక బృందం (Empowered Group of Secretaries) ద్వారా నిరంతర సమీక్ష రాష్ట్ర ప్రభుత్వ చర్యలు
ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో పౌర సరఫరాలు, వ్యవసాయం, ఆర్థిక శాఖల మంత్రులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో రోజువారీ పర్యవేక్షణ చేస్తున్నామన్నారు.
అపోహలు, వాస్తవాలతో
ప్రారంభంలో పానిక్ బుకింగ్ కారణంగా రోజుకు 85 లక్షల సిలిండర్ల బుకింగ్
ప్రస్తుతం బుకింగ్స్ సాధారణ స్థితికి (45–55 లక్షలు) చేస్తున్నారు..

దేశంలో తగినంత చమురు, గ్యాస్, ఎరువుల నిల్వలు ఉన్నాయని స్పష్టం
తెలుగులో రోజువారీ బ్రీఫింగ్‌లు, ప్రజలకు స్పష్టమైన సమాచారం అందించేందుకు రాష్ట్రంలో ప్రతిరోజూ తెలుగులో బ్రీఫింగ్ ఇవ్వనున్నట్లు తెలిపారు.

కార్యక్రమంలో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల రాష్ట్ర స్థాయి సమన్వయకర్త భాస్కర్ రెడ్డి, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ ప్రభాకర్ రావు లు పాల్గొన్నారు..

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఇంటింటా నెట్‌జీరో… ఆదర్శ గ్రామాలే లక్ష్యం

-ఇంటి నుంచే పర్యావరణ పరిరక్షణకు శ్రీకారం -అలవరం కోడూరులో నెట్‌జీరో విధానాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు మాడుగుల, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *