Breaking News

జీజీహెచ్‌లో లోపాలను వారంలోపు సరిదిద్దుకోవాలి

-జీజీహెచ్‌లో లోపాలను వారంలోపు సరిదిద్దుకోవాలిబయో మెడికల్ వేస్ట్ డిస్పోజల్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి
-స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలి
-స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ చైర్మన్ పట్టాభిరామ్

అనంతపురం, నేటి పత్రిక ప్రజావార్త :
అనంతపురం జిల్లా సర్వజన ఆస్పత్రి(జీజీహెచ్)లో బయో మెడికల్ వేస్ట్ డిస్పోజల్, శానిటేషన్ లో నెలకొన్న లోపాలను వారం రోజుల్లోపు సవరించుకోవాలని స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆదేశించారు. అనంతపురం నగరంలోని జీజీహెచ్ ఆస్పత్రిలో అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ తో కలిసి పట్టాభిరామ్ మంగళవారం సాయంత్రం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆస్పత్రిలో బయో మెడికల్ వేస్ట్ డిస్పోజల్ నిర్వహణ, శానిటేషన్ విషయంపై సూపరింటెండెంట్, హెచ్ఓడీలు, సిబ్బంది, ఏజెన్సీలవారితో పట్టాభిరామ్ మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకుని దిశా నిర్దేశం చేస్తూ పలు ఆదేశాలు జారీ చేశారు.

ఈ సందర్భంగా చైర్మన్ పట్టాభిరామ్ మాట్లాడుతూ జీజీహెచ్ లో బయో మెడికల్ వేస్ట్ డిస్పోజల్ నిర్వహణలో నెలకొన్న ఆందోళనకర విషయాలు, వాస్తవ పరిస్థితులు తెలుసుకునేందుకు ఇక్కడికి వచ్చామన్నారు. స్వర్ణాంధ్ర, స్వచ్ఛంధ్ర కార్యక్రమంను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రతినెల మూడవ శనివారం నిర్వహిస్తున్నారని, ఈ విషయంలో దేశంలోనే రాష్ట్రాన్ని రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతామన్నారు. మూడవ శనివారం స్వచ్చాంధ్ర కార్యక్రమాలు జరగాలని, అన్ని శాఖల్లోనూ స్వచ్చాంధ్ర కార్యక్రమాలు ఖచ్చితంగా చేయాలన్నారు. ప్రతినెలా ఒక థీమ్ తో ఈ కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. అయితే స్వచ్ఛత విషయంలో లోపాలు కనబడుతున్నాయని, సోషల్ మీడియా ద్వారా తమ దృష్టికి వచ్చిన లోపాల విషయమై పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ద్వారా నివేదికను తీసుకున్నామని, బయో మెడికల్ వేస్ట్ సెగ్రిగేషన్ సరిగా జరగడం లేదని, 4 కలర్స్ బిన్స్ ఏర్పాటు చేయడం లేదని, ఇతర ఆర్గానిక్, డ్రైవేస్ట్ కు సరైన స్టోరేజ్ ఫెసిలిటీ లేదని, బయో హజార్డ్ సైనేజస్ లేదని, ఇలా అన్ని రకాల లోపాలు ఒక నివేదిక ద్వారా బయటపడ్డాయన్నారు. స్వచ్చాంధ్ర లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలని, లోపాలు ఉండరాదన్నారు.

బయో మెడికల్ వేస్ట్ కలెక్షన్, డిస్పోజల్ కు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన నిబంధనలను తప్పనిసరిగా అమలు చేయాలన్నారు. డిస్పోజల్ పద్ధతి ప్రకారం సక్రమంగా జరగాలని, శ్రీవెన్ ఎన్విరాన్ టెక్నాలజీస్ ఏజెన్సీ వారు ప్రాపర్ గా కలెక్షన్, డిస్పోజల్ చేయాలని, ఇందులో ఎలాంటి నిర్లక్ష్యం ఉండరాదన్నారు. బయో మెడికల్ వేస్ట్ సేకరించేటప్పుడు సెగ్రిగేషన్ పాటిస్తున్నారా?, సెగ్రిగేషన్ లేకుండా ఎలా కలెక్ట్ చేస్తున్నారు? అని ప్రశ్నించారు. ఏజెన్సీలు అప్పజెప్పిన బాధ్యతను సక్రమంగా నిర్వహించాలని చెప్పారు. ఆసుపత్రి సూపరింటెండెంట్, ఏజెన్సీలు కూడా ఇందుకు బాధ్యతగా ఉండాలన్నారు. ప్రతి అంశం కూడా వారం రోజుల్లోపు సరిదిద్దాలని, ఈ వారం రోజుల్లోపు మరోక టీంని కూడా తనిఖీ కోసం పంపిస్తామన్నారు. ఎక్కడ చిన్న అంశంలో కూడా లోపం కనిపించరాదన్నారు.

జీజీహెచ్ సూపరింటెండెంట్ మాట్లాడుతూ ఏజెన్సీ వారు బయో మెడికల్ వేస్ట్ తరలింపు కోసం చిన్న వాహనం పెట్టారని తెలిపారు. ఏజెన్సీ వారు వాహనం మార్చాలని, మొదటి ప్రాధాన్యత జీజీహెచ్ కి ఇవ్వాలని, అన్ని రకాలుగా పరిశుభ్రంగా ఉంచాలని, పెద్ద వాహనం ఏర్పాటు చేయాలని, నిర్ణీత సమయానికి రోజు వచ్చి వేస్ట్ తరలింపు చేయాలని, ఖచ్చితంగా టైం షెడ్యూల్ ఉండాలని, నిబంధన ప్రకారం డిస్పోజల్ జరగాలని పట్టాభిరామ్ ఆదేశించారు. జీజీహెచ్ వారు సెగ్రిగేషన్ చేయాలని, కలర్ కోడింగ్ సిస్టం తప్పనిసరిగా పాటించాలని, అన్ సెగ్రిగేటెడ్ వేస్ట్ అప్పగించరాదని, సెగ్రిగేట్ చేసిన వేస్ట్ ఏజెన్సీకి ఇవ్వాలన్నారు. ఆస్పత్రి గురించి ప్రతికూల వార్తలు రాకుండా పనితీరు ఉండాలన్నారు.

జీజీహెచ్ లో శానిటేషన్ ఏజెన్సీ (పద్మావతి హాస్పిటాలిటి ఫెసిలిటీ అండ్ మేనేజ్మెంట్ సర్వీసెస్) వారు చేయాల్సిన బాధ్యతలను సక్రమంగా చేయాలని పట్టాభిరామ్ ఆదేశించారు. ప్రజల ఆరోగ్యం అంటే తమాషాగా ఉందా? అని అడిగారు. ఎలాంటి తమాషాలు చేయొద్దని, తేడా వస్తే, ఏజెన్సీని బ్లాక్ లిస్టులో పెడతామని హెచ్చరించారు. వీల్ చైర్ లలో బయో మెడికల్ వేస్ట్ తరలిస్తారా? అని ఏజెన్సీ వారిని ప్రశ్నించారు. ఈ విషయమై మంత్రి సత్య కుమార్ యాదవ్ తో మాట్లాడుతామన్నారు. వచ్చే గురువారం ఏజెన్సీ హెడ్ విజయవాడలోని స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ కార్యాలయానికి రావాలన్నారు.

ఈ సమావేశంలో స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ డైరెక్టర్లు భవాని రవికుమార్, పర్వీన్ బాను, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ మల్లేశ్వరి, అడ్మినిస్ట్రేటర్ మల్లికార్జున రెడ్డి, డీపీఓ నాగరాజు నాయుడు, నగరపాలక సంస్థ కమిషనర్ జస్వంత్ రావు, ఆర్ఎంఓ హేమలత, ఆయా విభాగాల హెచ్ఓడీలు, డా.ఆత్మరామ్, డా.భీమసేనచారి, డా.రాజేష్, సుభాష్ చంద్రబోస్, ఏజెన్సీల నిర్వాహకులు అశోక్, హరిప్రసాద్, ఆస్పత్రి డాక్టర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

వ్యవసాయాభివృద్ధికి శాస్త్రీయ పరిశోధనలు, సహజ వ్యవసాయమే భవిష్యత్‌కు మార్గం

-రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ బాపట్ల, నేటి పత్రిక ప్రజావార్త : వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న వాతావరణ మార్పులు, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *