Breaking News

మంత్రి నారా లోకేష్‌పై తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదు… : ఫతావుల్లా 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మంత్రి నారా లోకేష్‌పై తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదని.టీడీపీ మైనారిటీ రాష్ట్ర కార్యదర్శి ఫతావుల్లా మండిపడ్డారు, సోమవారం గణపతిరావు రోడ్డులోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్‌పై వెల్లంపల్లి శ్రీనివాస్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. డీఎస్సీ అంశంపై దమ్ముంటే వైసీపీ నేతలు చర్చకు రావాలని సవాల్ చేశారు. చర్చ కోసం మూడు కుర్చీలు కూడా సిద్ధం చేశామని.. వెల్లంపల్లి శ్రీనివాస్, దేవినేని అవినాష్, మల్లాది విష్ణు వచ్చి చర్చించవచ్చన్నారు. వెల్లంపల్లి ర్యాలీకి స్పందన లేకపోవడంతోనే రూట్ మ్యాప్ మార్చుకుని వెళ్లిపోయారని ఫతావుల్లా విమర్శించారు. జెన్ జీ వార్ పేరుతో నిర్వహించిన ర్యాలీలో యువత, విద్యార్థుల కంటే 60 ఏళ్లకు పైబడిన వారే ఎక్కువగా కనిపించారని ఎద్దేవా చేశారు. డీఎస్సీపై చర్చకు మంత్రి నారా లోకేష్ సిద్ధంగా ఉన్నారని, ఆన్‌లైన్‌లో అయినా చర్చకు సిద్ధమని ప్రకటించినా వైసీపీ నేతలు ముందుకు రావడం లేదన్నారు. డీఎస్సీ అంశంపై చర్చకు ఎంపీ కేసినేని శివనాథ్ చిన్ని, పశ్చిమ టీడీపీ ఇన్‌చార్జ్ బుద్ధ వెంకన్న సిద్ధంగా ఉన్నారని ఫతావుల్లా తెలిపారు. వైసీపీ నేతలు ఇకనైనా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని, మంత్రి నారా లోకేష్‌పై తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ సమావేశంలో టిడిపి నాయకులు కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *