Breaking News

ప్రధాన డ్రైన్లలో కన్వేయర్ బెల్ట్ లను 15 రోజుల్లోగా ఏర్పాటు చేయాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ప్లాస్టిక్ వ్యర్ధాలు ఎక్కువగా ఉండే ప్రధాన డ్రైన్లలో కన్వేయర్ బెల్ట్ లను 15 రోజుల్లోగా ఏర్పాటు చేయాలని, నగరంలో త్రాగు నీటి సరఫరా జరుగు సమయంలో సంబంధిత ఏ.ఈ లు, వార్డు కార్యదర్శులు ఫీల్డ్ లో ఉండి నూరు శాతం త్రాగునీటి శ్యాంపుల్స్ సేకరించాలని నగర కమిషనర్ కే. మయూర్ అశోక్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. బుధవారం నగర పాలకసంస్థలోని కాన్ఫరెన్స్ హాల్లో ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగరంలో ప్లాస్టిక్ వ్యర్ధాలు ఎక్కువగా ఉండే ప్రధాన కాలువల్లో 15 రోజుల్లోగా కన్వేయర్ బెల్ట్ లను ఏర్పాటు చేసి, కాలువల్లోని ప్లాస్టిక్ వ్యర్ధాలను ఎప్పటికప్పుడు తొలగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఏ.ఈ లు మరియు కార్యదర్శులు వారి పరిధిలో త్రాగునీటి సరఫరా పై ద్రుష్టి సారించాలని, ఎక్కడా కలుషిత నీరు సరఫరా జరగకుండా ఫీల్డ్ లో తిరుగుతూ వారి పరిధిలోని ఈఎల్ఎస్ఆర్ లలో మరియు గృహాల వద్ద నీటి శాంపిల్స్ విధిగా నూరు శాతం సేకరించాలని ఆదేశించారు. ఈ.యల్.యస్.ఆర్ లను నిర్దేశిత సమయానికి శుభ్రం చేయించాలని, అందుకు ప్రత్యేకంగా రిజిస్టర్లను నిర్వహించాలన్నారు. అలాగే వాటర్ మీటర్ రీడింగ్ తప్పకుండా తీయాలని, అవసరమైన ప్రాంతాలలో నూతన మీటర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఏఈ లను ఆదేశించారు. నగరంలోని ప్రధాన డ్రైన్లలో రెండవ విడత పూడికతీత పనులను శనివారం లోపు పూర్తి చేయాలని, ముఖ్యంగా కల్వర్ట్ ల దగ్గర సిల్ట్ తొలగింపు పనులు పూర్తి స్థాయిలో జరగుటలేదని పిర్యాదులు అందుతున్నాయని, వాటి పై ప్రత్యేక ద్రుష్టి సారించాలని, స్థానికంగా ఉండే ప్రజా ప్రతినిధులు మరియు ప్రజల సహకారం తీసుకోవాలన్నారు. ముఖ్యంగా కాలువల్లో తీసిన సిల్ట్ ను వెంటనే సదరు ప్రాంతం నుండి తొలగించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే నగరంలో ఉన్న పాట్ హొల్స్ కు రానున్న వారం రోజుల్లో మరమ్మతులు నిర్వహించాలని, ఎక్కడా కూడా పాట్ హోల్స్ కనబడకూడదని, ఏ.ఈ లు క్షేత్ర స్తాయిలో పర్యవేక్షణ చేయాలన్నారు. నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని, టెండర్ ప్రక్రియ పూర్తైనా పనులు ప్రారంభం కాని పనులను రద్దు చేయాలని, అభివృద్ధి పనులు జరిగే సమయంలో ఏ.ఈలు ప్రత్యక్షంగా పనులను పర్యవేక్షించాలన్నారు. నగరంలోని పార్కులు మరియు బరియల్ గ్రౌండ్స్ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని, 15వ ఆర్ధిక సంఘ నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులను త్వరితగతిన ప్రారంభించాలని, అందుకు అవసరమైన టెండర్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. నగరంలో నూరు శాతం స్ట్రీట్ లైటింగ్ వెలగాలని, అవసరమైన ప్రాంతాలలో నూతన లైట్లు ఏర్పాటు చేయాలన్నారు. ప్రజల నుండి అందే పిర్యాదులను నిర్దేశిత సమయంలోపు పరిష్కరించాలని, సమస్య పరిష్కరించే ముందు తరువాత ఫోటోలను తప్పనిసరిగా అప్ లోడ్ చేయాలని అధికారులను ఆదేశించారు.
సమావేశంలో ఎస్ఈ సుందర్రామిరెడ్డి, ఈఈలు విష్ణు మూర్తి, వేణుగోపాల్, డి.ఈ.ఈ లు, ఏ.ఈ లు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *