Breaking News

​ఆగస్టు 15న తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా కోర్టు ప్రాంగణాల్లో ‘వనమహోత్సవం’

-జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
మాన్యులైన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా న్యాయశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీన (స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా) “వనమహోత్సవం” కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ​పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహించేందుకు చేపడుతున్న ఈ మొక్కల పెంపకం కార్యక్రమం జిల్లాలోని అన్ని కోర్టు సముదాయాలు, న్యాయమూర్తుల నివాస గృహాల వద్ద మరియు వివిధ న్యాయస్థాన ప్రాంగణాల్లో జరుగుతుందని ఆయన వివరించారు. పర్యావరణ సమతుల్యత కోసం చేపడుతున్న ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, మీడియా ప్రతినిధులు మరియు అధికారులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ​కార్యక్రమం నిర్వహించే ప్రాంతాలు:
రాజమహేంద్రవరం, అమలాపురం, కాకినాడ, పెద్దాపురం, పిఠాపురం, రామచంద్రపురం, రాజోలు, కొత్తపేట, ఆలమూరు, ప్రత్తిపాడు, ముమ్మిడివరం, తుని, అనపర్తి, రంపచోడవరం మరియు అడ్డతీగల.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *