-ఒక గంటలలోనే 45 నుండి 50 కాల్స్ మాట్లాడి పార్లమెంట్ ప్రజల సమస్యలు తెలుసుకున్న ఎంపీ చిన్ని
-ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు కొత్త వేదిక ఏర్పాటు చేసుకున్న విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని
-ఫోన్లో తెలియజేసిన సమస్యలను పరితగతిన పరిష్కరించాలని పలు శాఖల అధికారులకు ఆదేశాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ గురునానక్ కాలనీలోని ఎంపీ కార్యాలయంలో నందు డయల్ యువర్ ఎంపీ విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు సైతం పాల్గొన్నారు. కేవలం ఒక గంట వ్యవధిలోని 45 నుండి 50 ఫోన్ కాల్స్ మాట్లాడి వారి సమస్యలకు పరిష్కారం తెలియజేసి వారికి భరోసాని ఇచ్చారు కొన్ని సమస్యలపై తన కార్యాలయానికి వచ్చి కలవాలని సూచించారు.
ఈ సందర్భంగా ఎంపి కేశినేని చిన్ని మాట్లాడుతూ విజయవాడ పార్లమెంట్ లోని ఏడు నియోజకవర్గాల ప్రజలు సమస్యలు తెలుసుకునేందుకు ఇలాంటి ఒక మంచి వేదికను ఏర్పాటు చేసుకున్నామని సుమారుగా మారుమూల తండా ప్రాంతాల నుంచి కూడా కాల్స్ రావడం పై ఎంపీ చిన్ని హర్షం వ్యక్తం చేశారు తనకు ఫోన్ చేస్తే సమస్య పరిష్కారం అవుతుందని వారు పెట్టుకున్న నమ్మకానికి తాను ఎప్పుడు కృతజ్ఞుడనై ఉంటానని తెలియజేశారు
వచ్చిన అన్ని సమస్యల్లో కూడా ప్రధానంగా డ్రైనేజీ సమస్యలు భూ సమస్యలు, పోలీస్ సమస్యలు కనెక్టివిటీ రోడ్స్ నీటి సమస్యలే ప్రధానంగా ఉన్నాయని వీటిని ఆయా శాఖల ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని తప్పకుండా త్వరలోనే ఈ సమస్యలన్నీ పరిష్కరించే దిశగా కృషి చేసి మళ్లీ త్వరలోనే ఇలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. అసలు పరిష్కారం కోసం కొందరు ఎంపీ చిన్ని తో మాట్లాడుతూ పార్లమెంట్ పరిధిలో జరుగుతున్న అభివృద్ధిపై ఎంపి ని అభినందించారు ఎవరు ఎన్ని విమర్శలు చేసినా ఇదే విధంగా అభివృద్ధిని ఎక్కడ రాజీ పడకుండా చేయాలని పార్లమెంట్ పరిధిలోని ప్రజలు సూచించారు తప్పకుండా ఎవరు ఎన్ని చెప్పినా విజయవాడ పార్లమెంట్ అభివృద్ధి మాత్రం ఆగేది లేదని తెలియజేశారు రాబోయే రోజుల్లో ఈ సమస్యల పరిష్కారానికి సైతం ఒక రోజు కేటాయించి సమస్యలని తన కార్యాలయం ద్వారా ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులను అప్రమత్తం చేస్తూనే ఉంటామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎంపీ కేశినేని చిన్ని జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News