Breaking News

ఎన్నికల విధానాలపై రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు శిక్షణా కార్యక్రమం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు పరిధిలో నిర్వహించనున్న 2026 రెండో సాధారణ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో, ఎన్నికల నిర్వహణకు సంబంధించిన విధివిధానాలపై మేయర్, వార్డు సభ్యుల రిటర్నింగ్ అధికారులు (ROలు), అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు (AROలు)కు మంగళవారం మధ్యాహ్నం గవర్నర్పేటలో గల ఐవీ పాలస్ లో నగరపాలక సంస్థ ఎలక్షన్స నోడల్ ఆఫీసర్ మరియు అదనపు కమిషనర్ ఏ రవీంద్రరావు, ఎలక్షన్స్ ట్రైనింగ్ నోడల్ ఆఫీసర్ మరియు వేరేటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ డి హరీష్ ఆధ్వర్యం లో శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం లో మేయర్ రిటర్నింగ్ ఆఫీసర్ మరియు హోసింగ్ పి డి రజిని కుమారి, ఎ ఆర్ ఓ మరియు వెస్ట్ డి టీ ఇస్మాయిల్ పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో నామినేషన్ల స్వీకరణ, ఎన్నికలకు సంబంధించిన నివేదికల తయారీ, పోలింగ్ ప్రక్రియతో పాటు ఎన్నికల నిర్వహణలో పాటించాల్సిన నిబంధనలు, విధివిధానాలపై అధికారులకు అవగాహన కల్పించారు. ఈ నేపథ్యంలో మేయర్ ఎన్నికకు సంబంధించిన రిటర్నింగ్ అధికారి, వార్డు సభ్యుల ఎన్నికలకు సంబంధించిన రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు నిర్దేశిత సమయానికి శిక్షణా కార్యక్రమానికి హాజరుకావాలని ఎన్నికల అదుకారులు సూచించారు. అధికారులు RO హ్యాండ్‌బుక్‌ను క్షుణ్ణంగా అధ్యయనం చేసి, ఎన్నికల నిర్వహణకు సంబంధించిన నిబంధనలు, మార్గదర్శకాలను పూర్తిగా తెలుసుకోవాలని ఆదేశించారు. అధికారులందరూ నిర్ణీత సమయానికి శిక్షణా వేదికకు చేరుకోవాలని, ఎన్నికల విధులను సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన ముందస్తు సన్నద్ధతతో ఉండాలని సూచించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఏపీ-తమిళనాడు ముఖ్యమంత్రులు చంద్రబాబు-విజయ్ భేటీ

-గోదావరి-కావేరి నదుల అనుసంధానంపై చర్చ -చెన్నై తాగునీటి అవసరాలు తీర్చాలని కోరిన తమిళనాడు సీఎం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త: …