Breaking News

రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం

– పోలింగ్ కేంద్రాలపై రాజకీయ పార్టీల అభిప్రాయం తీసుకోవటం జరుగుతుంది
–  కలెక్టర్ మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా వ్యాప్తంగా వున్న పోలింగ్ కేంద్రాల నేపథ్యంలో రాజకీయ పార్టీల నుంచి వొచ్చే ఆక్షేపణలను పరిగణన లోకి తీసుకుని ఆమేరకు ప్రతిపాదనలను పంపడం జరుగుతుందనీ కలెక్టర్ , జిల్లా ఎన్నికల అధికారి కె మాధవీలత తెలియ చేశారు. బుధవారం ఉదయంస్థానిక కలెక్టర్ ఛాంబర్ రాజకీయ పార్టీలతో  జిల్లా ఎన్నికల అధికారి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ కె. మాధవీలత మాట్లాడుతూ, జిల్లాలో జనవరి 22 తదుపరి చేపట్టిన ఓటర్ల నమోదు, మార్పులు చేర్పులు, తొలగింపు తదితర అంశాల పై వివరాలూ తెలియ చెయ్యడం జరిగిందన్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు మేరకు పోలింగ్ కేంద్రాల విషయంలో సహేతుకమైన ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అందులో భాగంగా రాజకీయ పార్టీల అభిప్రాయం తీసుకోవటం జరుగుతుందనీ అన్నారు. ముఖ్యంగా మూడు అంశాలను పరిగణనలోకి తీసుకోవడం జరుగుతోందని, పోలింగ్ కేంద్రాల మార్పు, పేర్లు మార్పు, 1500 వందలు పై బడి ఓటర్లు ఉన్న పోలింగ్ కేంద్రాలను. ఏ , బి లాగా విభజన ప్రక్రియను చేపట్టడం జరుగుతుందనీ అన్నారు. జిల్లాలో 1569 పోలింగ్ కేంద్రాలను గుర్తించడం జరిగిందన్నారు. పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ కోసం సంభందిత నియోజక వర్గ ఈ ఆర్ వో లకి ప్రతిపాదనలు ఇవ్వవచ్చు నని పేర్కొన్నారు. ఆమేరకు ఆయా రాజకీయ పార్టీల ద్వారా వొచ్చే ప్రతిపాదనలు, అదే విధంగా జిల్లా, నియోజక వర్గ ఎన్నికల అధికార యంత్రాంగం ప్రతిపాదన చేసిన వాటినీ రాజకీయ పార్టీల అభిప్రాయం తీసుకోవటం ద్వారా ప్రతిపాదన పంపుతామని చెప్పారు. ఎన్నికలు నోటిఫికేషన్ ఇచ్చే వరకూ మాత్రమే ఫారం 7 స్వీకరించడం జరుగు తుందన్నారు.

వర్చువల్ లో ఎన్నికల శిక్షణ
కేంద్ర ఎన్నికల కమిషన్ జిల్లా ఎన్నికల అధికారులకు వర్చువల్ ద్వారా ఎన్నికల నిర్వహణ పై శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగింది.. జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కే. మాధవీలత, జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్, డి ఆర్వో లు స్ధానిక కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో నుంచి పాల్గొనడం జరిగింది.

కేంద్ర ఎన్నికల కమిషన్
ఈ సమావేశంలో జిల్లా రెవిన్యూ అధికారి జి. నరసింహులు, రాజకీయ పార్టిల ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఇంఛార్జ్ ఎన్. రమేష్( శ్యామ్),  బీజేపీ – జిల్లా ప్రధాన కార్యదర్శి బి .రామచంద్రరావు , అప్- జిల్లా కార్యదర్శి ఎన్. సుబ్రహ్మణ్యం, సీపీఐ ఎమ్ – జిల్లా కమిటీ సభ్యుడు ఎస్ ఎస్ మూర్తి, టిడిపి జోన్ 2 కార్యదర్శిసి. శ్రీనివాస రావు, , కలెక్టరేట్ ఎన్నికల సెక్షన్ సిబ్బంది గిరీష్ , సునీల్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *