– ఎన్నికల ప్రక్రియ లో మార్గదర్శకాల ఖచ్చితంగా పాటించాలి
– విధుల నిర్వహణలో ఆర్వో లు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి
-పిపిటి ద్వారా శిక్షణ ఇచ్చిన జెసి తేజ్ భరత్, కమిషనర్ దినేష్ కుమార్, ఆర్డీవో చైత్ర వర్షిణి
– కలెక్టర్ /డీ ఈ వో డా కే.మాధవీలత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రానున్న సార్వత్రిక ఎన్నికల నిర్వహణ నామినేషన్లు స్వీకరణ నుంచీ ఫలితాలు వెల్లడించే వరకు వివిధ దశల్లో రిటర్నింగ్ అధికారులు, ఇతర ఎన్నికల సిబ్బంది యొక్క బాధ్యతలని అత్యంత జాగ్రత్తగా నిర్వర్తించాలని కలెక్టర్ & జిల్లా ఎన్నికల అధికారి కే. మాధవీలత స్పష్టం చేశారు. స్ధానిక కలెక్టరేట్ నుంచి కలక్టర్ / జిల్లా ఎన్నికల అధికారి కే. మాధవీలత, జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్, కమిషనర్ కె..దినేష్ కుమార్, సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ, సహయ కలెక్టర్ సి. యశ్వంత్ కుమార్, ఇతర నియోజక వర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, సహయ రిటర్నింగ్ అధికారులు, ఎలెక్టోరల్ అధికారులు, కలక్టరేట్ ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్బంగా జిల్లా ఎన్నికల అధికారి కె. మాధవీలత రానున్న సార్వత్రిక ఎన్నికల్లో నామినేషన్లు స్వీకరణ నుంచీ ఎన్నికల ఫలితాలు ప్రకటించే వరకు వివిధ దశల్లో ఎన్నికల విధుల్లో భాగస్వామ్యం అయ్యే అధికారులు, సిబ్బంది ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉందని స్పష్టం చేశారు. నామినేషన్ స్వీకరణ, పొలింగ్ మెటీరియల్ పంపిణీ, ఎన్నికల కోడ్ అమలు, రిసెప్షన్ కేంద్రాల ఏర్పాటు, పోస్టల్ బ్యాలెట్, హోం ఓటింగు అత్యంత ప్రాధాన్యత కలిగిన విధులు అన్నారు. ఎన్నికల కమీషన్ మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించడం, నియమ నిబంధనలు పాటించి ఎన్నికల ప్రోటోకాల్ అనుసరించి బాధ్యతలను నిర్వర్తించడం వరకు ఆర్ వో మాన్యువల్ తరచుగా పునశ్చరణ చేసుకోవాలన్నారు. నామినేషన్ స్వీకరణ, పరిశీలన, తిరస్కరణ, ఎన్నికలలో నిలిచే అభ్యర్ధుల ప్రకటన, గుర్తుల కేటాయింపు, బ్యాలెట్ పత్రాలు రూపకల్పన వరకు ప్రతి ఒక్క అంశం మీద పూర్తి అవగాహన అవసరం అన్నారు. ఈ క్రమంలో రిటర్నింగ్ అధికారులు నిర్వర్తించే బాధ్యతలు అత్యంత కీలకం అన్నారు. మార్గదర్శకాలు అమలులో జాగ్రత్తగా వ్యవహరించాలని, నిష్పక్షపాతంగా విధులను నిర్వర్తించాలన్నారు. నామినేషన్ ప్రక్రియ లో ఒక ప్రత్యేక కోర్ టీమ్ ని ఏర్పాటు చేసుకొవాలని మాధవీలత తెలియ చేశారు. పోలింగ్ కేంద్రాల కు ఈ వి ఎమ్ ఈ శిక్షణ కార్యక్రమం లో నామినేషన్లు ప్రక్రియ, ఎన్నికల ప్రణాళిక కార్యచరణ పై జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్, పోస్టల్ బ్యాలెట్, హోమ్ ఓటింగు, పై మునిసిపల్ కమీషనర్ కె. దినేష్ కుమార్, ఈవి ఎమ్ కమిషనింగ్ పై ఆర్డీవో ఏ. చైత్ర వర్షిణి లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కేంద్ర ఎన్నికల కమీషన్ జారీ చేసిన విధి విధానాలు మార్గదర్శకాల పై సమగ్ర సమాచారం అందచేశారు. అనంతరం , ఎన్నికల సంఘం మార్గదర్శకాలపై, ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులు మరియు ఇతర అధికారులతో బహిరంగ చర్చ నిర్వహించి సందేహాలను నివృత్తి చేయటం జరిగింది. ఈ సమావేశం లో రాజమండ్రీ రూరల్ ఆర్వో జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, రాజమండ్రీ అర్బన్ ఆర్వో మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్, కొవ్వూరు ఆర్వో , సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ్ , డి ఆర్వో జి. నరసింహులు, రాజానగరం ఆర్వో/ ఆర్డీఓ ఏ. చైత్ర వర్షిణి, గోపాలపురం ఆర్వో – (ఓఎన్జీసి ఎస్.డి.సి ) కె ఎల్ శివజ్యోతి, నిడదవోలు ఆర్వో (స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, పి ఐ పి ఆర్ ఎమ్ సి యూనిట్-I కొవ్వూరు.) ఆర్ వి రమణా నాయక్ , రాజమండ్రీ పార్లమెంట్ ఆర్ వో (కెఆర్ఆర్సీ ఎస్డిసి) ఆర్. కృష్ణా నాయక్ , అనపర్తి ఆర్వో (స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ (గెయిల్ (ఐ) లిమిటెడ్) ఎమ్. మాధురీ , తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News