-డీ బి టి ద్వారా నేరుగా బ్యాంకు ఖాతాలకు వర్చువల్ ద్వారా జమ చేసిన సిఎం
-కలెక్టర్ కె. మాధవీలత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు గోదావరి జిల్లా లో 2023 డిసెంబర్ నెలలో మీచాంగ్ తుఫాను, భారీ వర్షాలకు దెబ్బతిన్న వ్యయసాయ, ఉద్యాన వన పంటలకు ఇన్పుట్ కింద 11,854 హెక్టర్ల లో జరిగిన పంట నష్టం కోసం 18540 మంది రైతుల ఖాతాలకు 1782 లక్షల 65 వేలు జమ చెయ్యడం జరిగిందనీ జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత తెలియ చేశారు. బుధవారం సాయంత్రం గుంటూరు జిల్లా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుండి వర్చువల్ ద్వారా సిఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి రైతుల బ్యాంకు ఖాతాలకి జమ చేయడం జరిగింది. బుధవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరం నుంచి జిల్లా స్థాయి కార్యక్రమంలో కలెక్టర్ మాధవీలత, లబ్దిదార రైతులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ డా కె. మాధవీలత మాట్లాడుతూ, డిసెంబర్ -2023 నెలలో సంభవించిన మిచాంగ్ తుఫాను, భారీ వర్షాలు కారణంగా ఖరీఫ్ -2023లో వ్యవసాయ, ఉద్యాన వన పంట నష్టాల కోసం విడుదల చేసిన ఇన్‌పుట్ సబ్సిడీ కింద నిధులను విడుదల చేయటం జరిగిందన్నారు. రాష్ట్ర విపత్తుల నివారణ సంస్ధ మార్గదర్శకాలు మేరకు నష్టాన్ని అంచనా వేసి ఇన్పుట్ సబ్సిడీ విడుదల చేయటం జరిగిందన్నారు. వ్యవసాయ కేటగిరీలో నష్ట పోయిన వరి, వేరుశెనగ, పత్తి, చెరకు, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, పొగాకు, జొన్న & పప్పుధాన్యాలు (బ్లాక్ గ్రామ్, గ్రీన్ గ్రామ్ & బెంగాల్ గ్రామ్) పంటలు , ఉద్యాన వన పంటలు అరటి, బొప్పాయి, మిరప, టాపియోకా, జామ, ఆయిల్ పామ్, మేరిగోల్డ్, టమోటో, జీడి, మామిడి, అరటి, ఇతర కూరగాయలు & పూల పంటలు ముంపునకు గురయ్యాయనీ, వాటికి ఈరోజు నేరుగా ఇన్పుట్ సబ్సిడీ జమ చెయ్యడం జరిగిందన్నారు. వ్యవసాయ కేటగిరీలో 15615 మంది రైతులకు చెందిన 10,487.02 హెక్టార్ల లో జరిగిన నష్టానికి రూ.1480.52 లక్షలు, ఉద్యన వన పంటల కేటగిరీలో 2925 మంది రైతులకు చెందిన 1367.47 హెక్టార్ల లో జరిగిన నష్టానికి రూ.302.13 లక్షలు విడుదల చేయటం జరిగిందన్నారు. ఈ క్రాప్ నమోదు తప్పని సరిగా చేయాలన్నారు.. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి ఎస్. మాధవరావు, జిల్లా ఉద్యాన వన అధికారిణి బి. సుజాత కుమారి, లబ్ది దార రైతులు అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News