గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థలో ప్రతి సోమవారం జరిగే పిజిఆర్ఎస్ లో అందే ఆర్జీలను త్వరితగతిన పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ స్పష్టం చేశారు. సోమవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో సోమవారం కౌన్సిల్ సమావేశం ఉన్నందున కమిషనర్ ఆదేశాల మేరకు మేనేజర్, డిఈఈలు, ఏసిపీలు పిజిఆర్ఎస్ ద్వారా ప్రజల నుండి అర్జీలను తీసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పిజిఆర్ఎస్ ప్రజలు ఇస్తున్న అర్జీల పరిష్కారంకు విభాగాధిపతులు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రతి అర్జీని …
Read More »Tag Archives: guntur
ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక..కమిషనర్ కె.మయూర్ అశోక్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 16వ తేది సోమవారం గుంటూరు నగర ప్రజల స్థానిక సమస్యల పరిష్కారానికి 10:30 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు గుంటూరు నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం పార్కింగ్ వైపు జనన, మరణ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఎదుట “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక” (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం ద్వారా ప్రజల నుండి అర్జీలు, ఫిర్యాదులు తీసుకుంటామని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
Read More »ఉల్లాస్ అక్షర ఆంధ్రా పరీక్షలను తనిఖీ చేసిన కలెక్టర్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఉల్లాస్ అక్షర ఆంధ్రా పరీక్షలను జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ఆదివారం తనిఖీ చేశారు. గుంటూరు పట్టణం కె.వి. పి కాలనీ దగ్గరలో గల లాల్ పురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కేంద్రంలో జరుగుతున్న పరీక్షలను తనిఖీ చేశారు. కేంద్రంలో చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. ఎండ వేడిమి కారణంగా అన్ని కేంద్రాల్లో తాగునీటి సదుపాయం ఉండాలని ఆదేశించారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు వచ్చి పరీక్షలు రాయుటకు అనుగుణంగా తగు సూచనలు సలహాలు అందించాలని నిర్వాహకులకు ఆదేశించారు. …
Read More »మీకోసం వెబ్ సైట్ లో అర్జీలు సమర్పించవచ్చు
-సోమవారం పి.జి.ఆర్.ఎస్, రెవెన్యూ క్లినిక్ లు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి.జి.ఆర్.ఎస్)లో మాత్రమే కాకుండా “మీకోసం” వెబ్ సైట్ లోను ఆన్ లైన్ లో ప్రజలు అర్జీలు సమర్పించవచ్చని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. పి.జి.ఆర్.ఎస్ తో పాటు నిర్వహిస్తున్న రెవెన్యూ క్లినిక్ లను ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు. ప్రతి సోమవారం పి.జి.ఆర్.ఎస్, రెవెన్యూ క్లినిక్ లను ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరం ప్రాంగణంలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల …
Read More »సెలవు రోజుల్లో జిఎంసి క్యాష్ కౌంటర్లను సద్వినియోగం చేసుకుంటున్న పన్ను బకాయిదారులు…కమిషనర్ మయూర్ అశోక్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : 2025–26 ఆర్ధిక సంవత్సరము ఆస్తి పన్ను, బకాయిలను చెల్లించుటకు వీలుగా ఆదివారం శెలవు రోజైనా కూడా నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం, సర్కిల్ కార్యాలయంల్లో ఏర్పాటు చేసిన పన్నుచెల్లింపు కేంద్రాలు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పని చేస్తాయని, బకాయిదార్లు సద్వినియోగం చేసుకోవాలని నగర కమీషనర్ కె.మయూర్ అశోక్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగర ప్రజలు ఆస్తి, ఖాళీ స్థల పన్నులు మరియు నీటి …
Read More »సెలవు రోజుల్లోనూ పని చేయనున్న జిఎంసి క్యాష్ కౌంటర్లు
-రెండో శనివారం, ఆదివారం సెలవు రోజులు అయినప్పటికీ పనిచేయనున్నజిఎంసి క్యాష్ కౌంటర్లు … కమిషనర్ మయూర్ అశోక్ గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : 2025–26 ఆర్ధిక సంవత్సరము ఆస్తి పన్ను, ఇతర పన్నుల బకాయిలను చెల్లించుటకు వీలుగా, శని వారం, ఆదివారం శెలవు రోజైనప్పటికీ కూడా నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం, సర్కిల్ కార్యాలయాల్లో పన్నుచెల్లింపు కేంద్రాలు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తాయని, బకాయిదార్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ …
Read More »సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రక్రియను మరింత పటిష్టం చేయాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగర పరిశుభ్రతను మెరుగుపరచడం మరియు రాబోయే స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ఉత్తమ ఫలితాలు సాధించడమే లక్ష్యంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ (ఎస్డబ్ల్యుఎం) ప్రక్రియను మరింత పటిష్టం చేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమిషనర్ చాంబర్ లో ఇంజినీరింగ్, ప్రజారోగ్య విభాగాల అధికారులతో సంయుక్త సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరాన్ని చెత్త రహితంగా తీర్చిదిద్దడంలో క్షేత్రస్థాయి అధికారుల పాత్ర కీలకమని, ప్రతి డివిజన్‌లోనూ …
Read More »ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను 10 రోజుల్లో క్లియర్ చేయాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ఇన్ ప్రిన్సిపుల్ లే అవుట్ ప్యాట్రన్(ఐపిఎల్పీ) ప్రక్రియ పూర్తయిన ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను 10 రోజుల్లో క్లియర్ చేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ పట్టణ ప్రణాళిక కార్యదర్శులు, అధికారులను ఆదేశించారు. శుక్రవారం నగరంలోని గోరంట్ల, రెడ్డిపాలెం, ఇన్నర్ రింగ్ రోడ్, సుద్దపల్లి డొంక తదితర ప్రాంతాల్లో పట్టణ ప్రణాళిక అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో ఐపిఎల్పీలను తనిఖీ చేసి, పెండింగ్‌లో ఉన్న ఎల్ఆర్ఎస్, ఎఫ్ఎల్ఎస్ దరఖాస్తులను స్వయంగా పరిశీలించి, వాటి పురోగతిపై అధికారులకు …
Read More »బకాయి ఉన్నపన్ను వసూళ్లకు యుద్దప్రాతిపదిక యాక్షన్ ప్లాన్ మేరకు వెళ్లాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థకు బకాయి ఉన్నపన్ను వసూళ్లకు యుద్దప్రాతిపదిక యాక్షన్ ప్లాన్ మేరకు వెళ్లాలని, మేజర్ డిఫాల్టర్లకు రెడ్ నోటీసులు జారీ చేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ స్పష్టం చేశారు. గురువారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ సమావేశ మందిరంలో అదనపు కమిషనర్, డిప్యూటీ కమిషనర్లు, రెవెన్యూ అధికారులు, ఇన్స్పెక్టర్లు, అడ్మిన్ కార్యదర్శులతో పన్ను వసూళ్ల పురోగతిపై సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ తొలుత రోజువారీ వసూళ్లు చేయాల్సిన లక్ష్యంపై సమీక్షించి, …
Read More »నూతన పాలకవర్గం అభివృద్ధి పధంలో నిర్వహిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ ఎన్టీఆర్ స్టేడియంను నూతన పాలకవర్గం అభివృద్ధి పధంలో నిర్వహిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలని నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర అన్నారు. గురువారం నగర కమిషనర్ కె.మయూర్ అశోక్, స్టేడియం పాలకవర్గంతో కలిసి స్టేడియంలోని షటిల్ కోర్ట్, జిమ్ లు, బిలియర్డ్స్ బోర్డ్, టేబుల్ టెన్నిస్ కోర్ట్లతో పాటు స్టేడియంను పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ సుదీర్ఘ కాలం అనంతరం ఎన్నిక కాబడిన ఎన్టీఆర్ స్టేడియం పాలకవర్గం స్టేడియం …
Read More »
Prajavartha Online Telugu News