Breaking News

Tag Archives: guntur

అన్నదానం అనేది అన్ని దానాల్లో కల్లా శ్రేష్టం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అన్నదానం అనేది అన్ని దానాల్లో కల్లా శ్రేష్ఠమని ప్రముఖ విద్యావేత్త, గుంటూరు వాస్తవ్యులు ప్రస్తుత అమెరికన్ పౌరసత్వం కలిగిన వెంకట్ ఇక్కుర్తి ఐ.వి.యల్.యన్ శర్మ తెలిపారు. గురువారం మధ్యాన్నం ఆయన నగరంలోని అమరావతి రోడ్డులోని ఐ.డి హాస్పిటల్ వద్ద ఉన్న అన్నా క్యాంటీన్ని సందర్శించి భోజనం చేసారు. ఈ సందర్భముగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోని పేద ప్రజలను ద్రుష్టిలొ ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం అన్నా క్యాంటీన్ లను ఏర్పాటు చేయడం పేద …

Read More »

సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ స్టడీ టూర్…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఘన వ్యర్ధాలను పర్యావరణహితంగా నిర్వహించడానికి, నగరాల్లో డంపింగ్ యార్డ్ లు లేకుండా చేయడానికి వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ లు దోహదపడతాయని తమిళనాడు మునిసిపల్ శాఖ డైరెక్టర్ ఆఫ్ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్(డిఎంఏ) పి.మధుసూదన్ రెడ్డి అన్నారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ స్టడీ టూర్ లో భాగంగా గురువారం తమిళనాడు మున్సిపల్ విభాగం నుండి గుంటూరు వచ్చిన డిఎంఏ, మదురై కార్పోరేషన్ కమిషనర్ చిత్ర విజయన్, హోసూర్ కార్పోరేషన్ ఈఈ విక్టర్ జ్ఞానరాజ్, ఏఈ (డిఎంఏ) రవి చంద్రన్ …

Read More »

ప్రతి ఇంటి నుండి వచ్చే వ్యర్థాలను తడి, పొడి చెత్తగా వేరు చేసి ఇవ్వాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగర స్వచ్ఛతలో ప్రతి పౌరుడి పాత్ర ఎంతో ముఖ్యమని, ప్రతి ఇంటి నుండి వచ్చే వ్యర్థాలను తడి, పొడి చెత్తగా వేరు చేసి ఇవ్వాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు కోరారు. బుధవారం కమిషనర్ రెడ్డిపాలెం, విజయపురి కాలనీ, అన్నపూర్ణ నగర్, హిమని నగర్, టెలికాం నగర్, రెడ్డిపాలెం, అరండల్ పేట ప్రాంతాల్లో పారిశుధ్యం, అభివృద్ధి పనులను పరిశీలించి, సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ తొలుత రెడ్డిపాలెంలో స్థానికులతో మాట్లాడుతూ …

Read More »

పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ సమావేశం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మంగళవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశమందిరంలో జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా, సంయుక్త కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహా తో కలిసి పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ పై  రాజకీయపార్టీల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సమావేశంలో అమ్ ఆద్మీ పార్టీ ప్రతినిధి డా. టి సేవా కుమార్, బహుజన సమాజ్  పార్టీ ప్రతినిధి  చిరతనగండ్ల వాసు, భారతీయ జనతా పార్టీ ప్రతినిధి వైవీ సుబ్బారావు,   ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి  బి సునీల్ …

Read More »

ప్రభుత్వ రంగ సంస్థలు జవాబుదారీతనంతో పనిచేయాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ రంగ సంస్థలు పారదర్శకంగా, జవాబుదారీతనంతో పనిచేయాలని రాష్ట్ర శాసన సభ పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ చైర్మన్ కూన రవికుమార్ అన్నారు. గుంటూరు జిల్లాలో రాష్ట్ర శాసన సభ పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ, కూన రవి కుమార్ అధ్యక్షతన మంగళవారం పర్యటించింది. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్, రాష్ట్ర వైద్య సేవలు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్, ఏపీ ఏవియేషన్ కార్పొరేషన్, ఏపీ ఎయిర్పోర్ట్స్ అభివృద్ధి కార్పొరేషన్ కార్యకలాపాలపై కమిటీ సమీక్షించింది. కమిటీ …

Read More »

మౌళిక సదుపాయాల ఏర్పాటుకు దాతలు సహకరించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నగర ప్రజలకు ఆహ్లాదాన్ని పంచుతూ, ఆరోగ్యవంతమైన జీవనశైలిని ప్రోత్సహించే కార్యక్రమాలకు సంస్థలు, వ్యక్తులు ముందుకు రావడం అభినందనీయమని గుంటూరు నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర పేర్కొన్నారు. కొరిటెపాడు వాకింగ్ ట్రాక్ అభివృద్ధి, నూతన జిమ్ పరికరాల కొనుగోలుకు వెంకటేష్ కన్స్ట్రక్షన్స్ అధినేత పులివర్తి శేషగిరిరావు, ప్రధాన్ హాస్పిటల్స్ సంయుక్తంగా రూ.6లక్షలు విరాళం అందించారు. మంగళవారం మేయర్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో, నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు చేతుల మీదుగా కొరిటెపాడు వాకింగ్ ట్రాక్ ప్రెసిడెంట్ కన్నసాని …

Read More »

అన్నక్యాంటీన్లలో శుభ్రత, సేవా ప్రమాణాలు మెరుగ్గా ఉండేలా చర్యలు తీసుకోవాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజలకు నాణ్యమైన ఆహారం అందించే లక్ష్యంతో నడుస్తున్న అన్నక్యాంటీన్లలో శుభ్రత, సేవా ప్రమాణాలు మెరుగ్గా ఉండేలా చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు అధికారులు, నిర్వాహకులను ఆదేశించారు. మంగళవారం కమిషనర్ ఆర్టీఓ ఆఫీస్ సమీపంలోని అన్న క్యాంటీన్‌ను పరిశీలించి, భోజనం తీసుకుంటున్న వారితో మాట్లాడి ఆహారం నాణ్యత, రుచిపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. పరిసరాల శుభ్రతను పరిశీలించి, శుభ్రతను కాపాడాలని సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన, శుభ్రమైన ఆహారం అందించడంలో …

Read More »

డ్రైన్ల నిర్మాణ పనులను ప్రారంభించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని పూడిక తీసిన ప్రాంతాల్లో వెంటనే డ్రైన్ల నిర్మాణ పనులను ప్రారంభించాలని ఇంజినీరింగ్ అధికారులను నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశించారు. మంగళవారం కమిషనర్ బాలాజీ నగర్, కృష్ణబాబు నగర్, లక్ష్మీపురం ప్రాంతాల్లో రోడ్లు, డ్రైన్ల నిర్మాణ పనులను, రోడ్ల ఆక్రమణలను పరిశీలించి, సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వర్షాకాలంలో నీరు నిలిచిపోకుండా పూడికతీసిన మేజర్ డ్రైన్ల ప్రాంతాల్లో తక్షణ చర్యలు తీసుకుని డ్రైన్ నిర్మాణ పనులను …

Read More »

అర్జీల పరిష్కారానికి విభాగాధిపతులు ప్రత్యేక శ్రద్ధ చూపాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ ప్రతి సోమవారం జరిగే పిజిఆర్ఎస్ కు ప్రజలు అందించే ఫిర్యాదులు, అర్జీల పరిష్కారానికి విభాగాధిపతులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు విభాగాధిపతులకు స్పష్టం చేశారు. సోమవారం క్యాంప్ కార్యాలయంలో డయల్ యువర్ కమిషనర్, నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్లో పిజిఆర్ఎస్ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ తొలుత డయల్ యువర్ కమిషనర్ ద్వారా ప్రజల నుండి అందిన 25 ఫిర్యాదులు తీసుకొని, అధికారులతో మాట్లాడుతూ ప్రజల నుండి అందే …

Read More »

రోడ్లు, డ్రైన్ల నిర్మాణాలు నిర్దేశిత గడువు మేరకు పూర్తి అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో రోడ్లు, డ్రైన్ల నిర్మాణాలు నిర్దేశిత గడువు మేరకు, నాణ్యతా ప్రమాణాలతో జరిగేలా ఇంజినీరింగ్ అధికారులు చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశించారు. సోమవారం కమిషనర్ ఏటి అగ్రహారం మెయిన్ రోడ్, నగరంపాలెం, కుందుల రోడ్, బృందావన్ గార్డెన్స్, కృష్ణ నగర్, గుజ్జనగుండ్ల, ఎస్వీఎన్ కాలనీ ప్రాంతాల్లో రోడ్లు, డ్రైన్ల నిర్మాణ పనులను, రోడ్ల ఆక్రమణలను పరిశీలించి, సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గుంటూరు …

Read More »