Breaking News

అన్నదానం అనేది అన్ని దానాల్లో కల్లా శ్రేష్టం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అన్నదానం అనేది అన్ని దానాల్లో కల్లా శ్రేష్ఠమని ప్రముఖ విద్యావేత్త, గుంటూరు వాస్తవ్యులు ప్రస్తుత అమెరికన్ పౌరసత్వం కలిగిన వెంకట్ ఇక్కుర్తి ఐ.వి.యల్.యన్ శర్మ తెలిపారు. గురువారం మధ్యాన్నం ఆయన నగరంలోని అమరావతి రోడ్డులోని ఐ.డి హాస్పిటల్ వద్ద ఉన్న అన్నా క్యాంటీన్ని సందర్శించి భోజనం చేసారు.
ఈ సందర్భముగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోని పేద ప్రజలను ద్రుష్టిలొ ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం అన్నా క్యాంటీన్ లను ఏర్పాటు చేయడం పేద ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని, అన్నదానం అనేది అన్ని దానాల్లో కల్లా శ్రేష్ఠమని చెబుతూ, ఈ బృహత్ కార్యక్రమాన్ని అత్యంత సమర్ధవంతంగా నిర్వహిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వానికి , రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అభినందనలు తెలియజేసారు. రాష్ట్రంలో కొత్తగా వచ్చినటువంటి బిక్షాటనను నిషేదించటం వలన, వాళ్ళు అందరు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకొని, అన్నా క్యాంటీన్ల ద్వార వాళ్ళ జీవన ప్రమాణాలను పెంచుకోవాలని ఆయన హితవు పలికారు. టి.టి.డిలో ఉన్న అన్నదాన పధకంల, దాతలు మరియు యన్.ఆర్.ఐ లు ఈ పధకానికి కూడా చేయుతనివాలని, దానికి తన వంతు కృషి గా అమెరికాలోని యన్.ఆర్.ఐ స్నేహితుల తో మాట్లాడుతాను అని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమములో అన్న క్యాంటీన్ నిర్వాహకులు, గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది, తధితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *