విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ లో ట్రాఫిక్ నిబంధనలపై ఓరియంటేషన్ కార్యక్రమం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ నెహ్రూ యువ కేంద్రం విజయవాడ మరియు ఎన్టీఆర్ కమిషన్ రేట్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ మరియు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఎన్ఎస్ఎస్ యూనిట్ సంయుక్త ఆధ్వర్యంలో భారత రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు “అర్బన్ ఏరియా ట్రాఫిక్ వాలంటరింగ్ ” రెండో వ ఒరియెంటేషన్ కార్యక్రమం స్థానిక విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ డిమాండ్ టు బి యూనివర్సిటీ ఆవరణలో విద్యార్థులతో కలిసి ట్రాఫిక్ నిబంధనలపై ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఎ మెహన్ మాట్లాడుతూ మనసు శరీరం ఒకే విధంగా పనిచేయాలని వాహనదారులు ఆలోచనతో అతివేగంతో వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలకు గురవుతున్నారని వీటికి అడ్డుగట్ట వేయడానికి ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటుందని హెల్మెట్ సీట్ బెల్ట్ వంటి భద్రతా నియమాలను పాటించి ట్రిపుల్ రైడింగ్ డ్రంక్ అండ్ డ్రైవ్ వంటి వాటిని నిర్మూలిస్తున్నామని ఆయన ఈ సందర్భంగా విద్యార్థులతో తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో జిల్లా యువ అధికారి సుంకర రాము మాట్లాడుతూ నెహ్రూ యువ కేంద్రం అనేది దేశంలోనే అతిపెద్ద యూత్ నెట్వర్క్ ను కలిగి ఉందని అందువలన భారత రవాణా మరియు రహదారుల శాఖ అర్బన్ ఏరియా ట్రాఫిక్ వాలంటరీ కార్యక్రమంను అప్పగించడం జరిగిందని ఆయన తెలిపారు ఈరోజు జరిగిన ఓరియంటేషన్ కార్యక్రమం ద్వారా వీరందరికీ అవగాహన కల్పించి వీరితో ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద వాహనదారులకు అవగాహన కల్పించడం మరియు హెల్మెట్ వినియోగం వంటి వాటిపై సదస్సు నిర్వహించడం జరుగుతుందని ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాబొయె రోజుల్లో ట్రాఫిక్ కార్యక్రమాల్లో పాల్గొనే విద్యార్థులందరికీ ఒరియంటేషన్ ద్వారా అవగాహన కల్పించడం జరుగిందని సుమారు 150 మందికి పైగా హాజరైన విద్యార్థులకు టీ షర్ట్స్ మరియు క్యాప్స్ అందించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎండి ఆలి మరియు రోడ్ సేఫ్టీ ఎస్ఐ మ ఎస్.కె త్రిమూర్తులు మరియు పెనమలూరు లాండ్ ఆర్డర్ సిఐ జె వెంకటరమణ హొండా రొడ్ సేఫ్టీ మేనేజర్ నాగరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మస్టర్ పాయింట్లను ఆకస్మిక తనిఖీ

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : వార్డ్ సచివాలయ శానిటేషన్ కార్యదర్శులు మస్టర్ సమయంలో తప్పనిసరిగా ప్రజారోగ్య కార్మికుల హాజరు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *