-విజయవాడ నగరపాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రజలను ఏకతాటిపైకి తీసుకురావడంలో ‘వందేమాతరం’ గేయానిది గొప్ప పాత్రని విజయవాడ నగరపాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి అన్నారు. జాతీయ గేయం ‘వందేమాతరం’కి 150 సంవత్సరాలు పూర్తయ్యాయిన సందర్భంగా శుక్రవారం ఉదయం ‘వందేమాతరం’ గీతం పూర్తి రూపాన్ని సమూహంగా ఆలపించే కార్యక్రమంను విజయవాడ నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రజలను ఏకతాటిపైకి తీసుకురావడంలో, వారిలో దేశభక్తిని నింపడంలో ‘వందేమాతరం’ గేయానిది గొప్ప పాత్ర అని, ‘వందేమాతరం’ నినాదంతో బ్రిటిష్ పాలకులకు భారతీయులు ఎదిరించారని అన్నారు. బంకించంద్ర ఛటర్జీ రాసిన ‘వందేమాతరం’ గేయానికి 150 సంవత్సరాలు పూర్తైన నేపథ్యంలో ఏడాది పొడవునా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, నవంబర్ 7, 2025 నుంచి 2026 నవంబర్ 7 వరకు దేశవ్యాప్తంగా సంవత్సరం పొడవునా కార్యక్రమాలు నిర్వహించనున్నారన్నారు.
ఈ సందర్భంగా అడిషనల్ కమిషనర్ (జనరల్) ఏ.రవీంద్రరావు మాట్లాడుతూ బ్రిటిష్ పాలనలో కోర్టులో చంద్రశేఖర్ అజాద్‌కు 16 కొరడాల దెబ్బల శిక్ష విధించగా, తనపై పడుతున్న ఒక్కొక్క దెబ్బకు వందే మాతరం అంటూ ఆ పోరాటయోధుడు అరిచాడంటే ఆ నినాదం స్వాతంత్ర్య ఉద్యమంలో ఎంతగా ప్రభావం చూపిందో అర్థం చేసుకోవచ్చు అని అందరిలో స్ఫూర్తినింపారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మహదేవ్ అప్పాజీరావు, మరుపిళ్ళ రాజేష్, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కే. అర్జునరావు, చీఫ్ ఇంజనీర్ ఇంచార్జ్ పి. సత్యకుమారి, ప్రాజెక్ట్ ఆఫీసర్ (యు సి డి) పి వెంకటనారాయణ, డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ చంద్రశేఖర్, విఎంసి సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News