-కలెక్టర్ కీర్తి చేకూరి
-ప్రజా సమస్యలపై తక్షణ స్పందన… శాశ్వత పరిష్కారాలే లక్ష్యం – కలెక్టర్ కీర్తి చేకూరి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS), రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాల ద్వారా వచ్చిన అర్జీలను అధికారులు సమగ్రంగా పరిశీలించి శాశ్వత పరిష్కారాలు చూపాలని కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశించారు. సమస్యలు తిరిగి “రీ ఓపెన్” కాకుండా, మూల కారణాలను గుర్తించి పూర్తి స్థాయిలో పరిష్కారం కల్పించడం ముఖ్యమని స్పష్టం చేశారు.
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆర్థిక, ఆర్థికేతర అంశాల ప్రకారం విభజించి, నిర్దిష్ట కాలపట్టికలో పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు. ప్రజలకు న్యాయం జరిగేలా ప్రతి అర్జీపై అధికారులు చొరవ చూపాలని, సమగ్ర పరిష్కారం అందించడం ద్వారా ప్రజల్లో నమ్మకం పెంపొందించాలని అన్నారు.
సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో మొత్తం అర్జీలు 187 అర్జీలు స్వీకరించామన్నారు. శాఖల వారీగా వచ్చిన అర్జీలలో రెవెన్యూ (రెవెన్యూ క్లినిక్) 91, పంచాయతీ రాజ్ & గ్రామీణ అభివృద్ధి 37, గృహ శాఖ 16, పాఠశాల విద్య (హ్యూమన్ రిసోర్సెస్) 8, మున్సిపల్ పరిపాలన 5, వ్యవసాయం & సహకారం 5, పశుసంవర్థక, పాలు, మత్స్యశాఖ 4, పరిశ్రమలు & వాణిజ్యం 3, పౌర సరఫరాలు 3, మహిళా, శిశు, వృద్ధుల సంక్షేమం 2, రవాణా & రోడ్లు 2, కార్మిక శాఖ 1, ఆరోగ్య శాఖ 1, ఉన్నత విద్య 1 అర్జీలు ఉన్నాయి.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్, జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) టి సీతారామ మూర్తి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు ఎస్ భాస్కర్ రెడ్డి, ఆర్డీవో ఆర్ శివ రాముడు, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News