Breaking News

చెరువుల పూడిక తీతతో భూగర్భ జలాల పెంపు లక్ష్యం

కోరుకొండ, నేటి పత్రిక ప్రజావార్త :

జలధార కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ కీర్తి చేకూరి, ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ

జలధార కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశ్యం చెరువుల పూడిక తీత పనులను చేపట్టి, 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా వాటిని పూర్తి చేసి భూగర్భ జలాల స్థాయిని పెంపొందించడం అని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు.

సోమవారం కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామంలో నిర్వహించిన “జలధార” కార్యక్రమంలో స్థానిక శాసన సభ్యులు బత్తుల బలరామకృష్ణతో కలిసి కలెక్టర్ కీర్తి చేకూరి పాల్గొన్నారు. అనంతరం రైతులతో క్షేత్ర స్థాయిలో పరిస్థితులను పరిశీలించి, వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా భూగర్భ జలాల సగటు స్థాయి 7–8 మీటర్లు ఉండగా, తూర్పు గోదావరి జిల్లాలో అది సుమారు 21 మీటర్ల లోతులో ఉందని తెలిపారు. జిల్లాలో మెరక ప్రాంతాలు, సాఫ్ట్ సోయిల్ భూములు అధికంగా ఉండడం వల్ల భూగర్భ జలాలు దిగజారుతున్నాయని వివరించారు.
భూగర్భ జలాలు తగ్గిపోవడంతో వాటిని పైకి తీయడానికి భారీగా విద్యుత్ వినియోగం అవుతోందని, రాష్ట్రవ్యాప్తంగా ఇందుకు రూ. 5000 కోట్ల వరకు ఖర్చు అవుతోందన్నారు. చెరువుల పూడిక తీత ద్వారా భూగర్భ జలాలను కాపాడగలిగితే విద్యుత్ ఖర్చును తగ్గించి, ఆ వనరులను తిరిగి నీటి వనరుల అభివృద్ధికి వినియోగించవచ్చని తెలిపారు.

చెరువుల పూడిక తీత ద్వారా కనీసం ఒక మీటరు మేర భూగర్భ జలాల స్థాయి పెరిగినా రైతులకు గణనీయమైన లాభం చేకూరుతుందని, సాగు సంఘాలు, స్థానిక ప్రజల సహకారం అత్యంత అవసరమని పేర్కొన్నారు. ఒక చెరువు నుంచి మరొక చెరువుకు నీరు చేరేలా చైన్ లింక్ వ్యవస్థ, కాలువల మరమ్మత్తులు, కేస్ కట్స్, గట్ల బలోపేతం వంటి అంశాలపై ప్రతిపాదనలు అందించాలని కలెక్టర్ సూచించారు. వర్షాలు వచ్చినా నిండని చెరువులను గుర్తించి, వృథాగా పోతున్న నీటిని సద్వినియోగం చేసేందుకు స్థానికుల అనుభవాన్ని వినియోగించుకోవాలని తెలిపారు. సంప్రదాయ వ్యవసాయం చేస్తున్న రైతుల సూచనలు ఎంతో విలువైనవని పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనలను ఉపాధి హామీ పథకం కింద అమలు చేసే అవకాశం ఉందన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు సమపాళ్లలో అమలు అవుతున్నాయని తెలిపారు. నీటి భద్రత అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని, ప్రాంతంలో భూగర్భ జలాలు తగ్గిపోవడం ఆందోళనకరమని అన్నారు.
వర్షాకాలంలో వచ్చే నీటిని సక్రమంగా వినియోగించుకుంటే భూగర్భ జలాలను పెంచవచ్చని తెలిపారు.

ముఖ్యమంత్రి పిలుపు మేరకు జలధార కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని బత్తుల బలరామకృష్ణ కోరారు. ఉపాధి హామీ పనుల్లో సాంకేతిక కారణాల వల్ల హాజరు నమోదు కాకపోవడంతో నియోజకవర్గంలో సుమారు 1200 మంది కూలీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. శ్రీరంగపట్నం గ్రామంలో బురద కాలువ సమస్యను పరిష్కరించాలని, సురంపాలెం–ఉసురువల్లి రిజర్వాయర్ నుంచి ముందస్తు హెచ్చరికలు లేకుండా నీటిని విడుదల చేయడం వల్ల ముంపు సమస్యలు ఏర్పడుతున్నాయని వివరించారు. చెరువుల పూడిక తీత కనీసం ఒక మీటరు మేర చేయాలని, తూములు శుభ్రపరచడం, సెట్టర్లు మరమ్మత్తు చేయడం, చెరువు గట్లు మరియు కాలువ గట్లు బలోపేతం చేయడం అత్యవసరమని సూచించారు.

ఈ కార్యక్రమం లో ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ పి చిన బాబు, ఎస్ ఈ జి. శ్రీనివాస్ రావు , ఆర్ డి ఓ ఆర్ .శివ రాముడు, అగ్రికల్చర్ ఏ డి శ్రీనివాస్, ,తహసీల్దార్ సుగుణ , ఎంపీడీఓ అశోక్ కుమార్ , ఇరిగేషన్ ఏ ఈ జగదీశ్ , సి ఐ సత్యనారాయణ మూర్తి
రైతు మద్దాల రమణ , స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, మండల స్థాయి అధికారులు, రైతులు, సాగు సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఇంటింటా నెట్‌జీరో… ఆదర్శ గ్రామాలే లక్ష్యం

-ఇంటి నుంచే పర్యావరణ పరిరక్షణకు శ్రీకారం -అలవరం కోడూరులో నెట్‌జీరో విధానాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు మాడుగుల, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *