Breaking News

ప్రజా అర్జీలను సకాలంలో పరిష్కరించాలి:పరిపాలనాధికారి ఎం. సుజాత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక, రెవెన్యూ క్లినిక్‌లలో అందిన అర్జీలను సకాలంలో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయ పరిపాలనాధికారిణి ఎం. సుజాత అధికారులకు సూచించారు.

సోమవారం ఉదయం ఆర్డీవో కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాల క్రింద ప్రజల నుండి అందిన అర్జీలు, వినతులను ఆమె స్వీకరించారు.
ఈ సందర్భంగా అర్జీలను సంబంధిత శాఖల అధికారులకు పంపిస్తూ, వాటిపై సత్వర విచారణ చేపట్టి తగిన పరిష్కారం అందించాలని ఆదేశించారు. ప్రజల నుండి అందిన అర్జీలను నూరు శాతం పరిష్కరించేలా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో రెవెన్యూ క్లినిక్‌కు సంబంధించి 2 అర్జీలు, పీజీఆర్ఎస్‌కు సంబంధించి 1 అర్జీ అందినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఇంటింటా నెట్‌జీరో… ఆదర్శ గ్రామాలే లక్ష్యం

-ఇంటి నుంచే పర్యావరణ పరిరక్షణకు శ్రీకారం -అలవరం కోడూరులో నెట్‌జీరో విధానాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు మాడుగుల, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *