విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గొల్లపూడి మహాత్మా గాంధీ హోల్ సేల్ కమర్షియల్ కాంప్లెక్స్ లో 193 షాపు నందు విజయ్ కనకదుర్గ పార్సిల్ సర్వీస్ సోమవారం ప్రారంభించడం జరిగింది. ఈ ప్రారంభోత్సవ మహోత్సవం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్య నిర్వహణ కార్యదర్శి బొమ్మసాని సుబ్బారావు చేతుల మీదగా నిర్వహించడం జరిగింది. మొదట బొమ్మసాని సుబ్బారావు రిబ్బన్ కట్ చేసి పార్సిల్ ఆఫీస్‌ను ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఆలోచనలకు అనుగుణంగా ఇంటికొక పారిశ్రామికవేత్త ఉండాలని సొంత వ్యాపారాన్ని ఏర్పాటు చేసుకున్నందుకు యాజమాన్యం కి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రభుత్వం తరఫునుంచి తమ వ్యాపార అభివృద్ధికి కావాల్సిన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. అనంతరం విజయ కనకదుర్గ పార్సిల్ సర్వీస్ యజమాని చినపంగి భాస్కర్ మాట్లాడుతూ తమకు పార్సిల్ సర్వీస్ రంగంలో 30 సంవత్సరాల అపారమైన అనుభవం ఉందని అన్నారు.
తిరువూరు, కంభంపాడు, గంపలగూడెం, ఊటుకూరు, పెనుగొలను, కొనిజర్ల నెమలి డైలీపార్సిల్ సర్వీస్ ద్వారా కిరణా సామాన్లు, హార్డ్‌వేర్ వస్తువులు, ప్లైవుడ్ వివిధ రకాల గూడ్స్ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎక్కడికైనా పార్సిల్ సేవలు అందుబాటులోకి ఉన్నాయని ఈ అవకాశాన్ని హోల్‌సేల్ వ్యాపారులను సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నామన్నారు. అతి తక్కువ ధరలకు కస్టమర్ యొక్క వస్తువులను భద్రంగా తమ తమ గమ్య స్థానాలకు చేర్చుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో చినపంగి చందు, చినపంగి మోహన్, చినపంగి చక్రవర్తి, కోనపురెడ్డి కళ్యాణ్, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News