Breaking News

కేజీబీవీ విద్యార్థుల విద్యా ప్రమాణాల పెంపు, భద్రతపై దృష్టిసారించాలి

-కేజీబీవీ సెక్రటరీ డి. దేవానంద రెడ్డి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కేజీబీవీల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అత్యుత్తమ వసతులు, పౌష్టికాహారం, ఆరోగ్య భద్రత కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని కేజీబీవీ సెక్రటరీ డి. దేవానంద రెడ్డి అన్నారు. సోమవారం లయోలా కాలేజీ ప్రాంగణం ఎస్-జె ఎక్స్లెన్స్ సెంటరులో కేజీబీవీ జీసీడీవోలు, ప్రిన్సిపాళ్లతో ‘కరదీపిక రూపకల్పన’పై వర్క్ షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ఏడాది ‘విజయ పథం’ కార్యక్రమం ద్వారా మంచి ఉత్తీర్ణత సాధించామని వచ్చే ఏడాది మరింత పురోభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. కేజీబీవీల్లో చదువుతున్న విద్యార్థులను సొంత పిల్లల్లా భావించి వారి చదువు, ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

16 నెలలు… 16కు పైగా విజయాలు…

-స్పష్టమైన మార్పు చూపించిన ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమం -ఇదే స్ఫూర్తితో పనిచేయాలని ప్రభుత్వ యంత్రాంగానికి సీఎం చంద్రబాబు పిలుపు -ప్రజల సహకారంపై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *