Breaking News

ప్రధాని నరేంద్ర మోడీ జాతికి క్షమాపక్ష చెప్పాలి

-దేశ ఆర్థిక పరిస్థితిపై పార్లమెంటు, అఖిలపక్ష సమావేశాలు నిర్వహించాలి
-సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అమెరికా ఒత్తిడిలకు తలొగ్గి, భారతదేశ ఆర్థిక పరిస్థితిని దిగజార్చిన ప్రధాని నరేంద్రమోడీ జాతికి క్షమాపణ చెప్పాలని, తక్షణమే పార్లమెంటు సమావేశాలు, అఖిలపక్ష సమావేశం నిర్వహించి చర్చించాలని సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు.
ఈ మేరకు కె రామకృష్ణ నేడు ఒక ప్రకటన విడుదల చేశారు. నిన్న హైదరాబాద్‌లో ప్రధాని నరేంద్రమోడీ పర్యటన సందర్భంగా ప్రజలనుద్దేశించి కోవిడ్ సమయంలోలా వర్క్ ఫ్రం హోం చేయాలంటూ; కోవిడ్ సమయంలో ఎలాగైతే జీవనం సాగించారో ఆ విధంగా ఉండాలంటూ; పెట్రోల్, డీజిల్, ఎరువులు అన్నింటి వాడకం తగ్గించుకోవాలంటూ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్ప్పుబడుతున్నాం. దీనినిబట్టి మోడీ ప్రభుత్వ డొల్లతనం బయటపడుతోంది. ఇటీవల 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసే వరకు దేశం పరిస్థితి బ్రహ్మాండంగా ఉందంటూ ఊదరగొట్టారు. అమెరికాతో, చైనాతో భారత్ పోటీపడుతోందని చెప్పారు. ప్రపంచమంతా భారతదేశంవైపు చూస్తోందని, 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా పేర్కొంటూ మోడీ ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చారు. ఎన్నికల ఓటింగ్ ముగిసిన వెంటనే వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను రూ.993లు పెంచేశారు. ఇప్ప్పుడు ఎన్నికల ప్రక్రియ ముగిసిన వెంటనే మాటమార్చి ప్రజల అవసరాలు తగ్గించుకోవాలంటూ ధర్మోపన్యాసం చేస్తున్నారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న అనాలోచిత విధానాలకు, ఒత్తిడిలకు మోడీ తలొగ్గారు. ఇజ్రాయిల్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. వెనిజులా అధ్యక్షుడిని అక్రమంగా అరెస్టు చేస్తే నోరు మెదపలేదు. అలీ ఖమేనీని హతమారిస్తే మాట్లాడలేదు. అంతేకాకుండా పదేపదే అమెరికాకు వత్తాసు పలికే విధంగా ప్రవర్తించారు. ఇరాన్, రష్యాల వద్ద నుండి క్రూడాయిల్ కొనద్దని ట్రంప్ చెబితే తలూపారు. మొత్తంగా అమెరికాకు మోడీ లొంగిపోయారు. కాని ఇప్ప్పుడు ఆయిల్ లేదు కాబట్టి వాహనాలు నడపొద్దని, ఎరువులు లేవు కాబట్టి పంటలు పండించొద్దన్నట్లు చెబుతున్నారు. దేశంలో ఈ దుస్థితికి కారణం నరేంద్రమోడీ ప్రభుత్వం అనుసరించిన విధానాలేనని స్పష్టమవుతోంది.
కేంద్రంలో నరేంద్రమోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు, విదేశాంగ విధానం ఫలితంగా దేశ ఆర్థిక స్థితి దిగజారింది. దేశంలో కోట్లాది మంది ప్రజలు నానా రకాలుగా ఇబ్బందులు పడుతున్నప్పటికీ మోడీ సర్కార్‌కు ఏమాత్రం పట్టడం లేదు. పెట్రోల్, డీజిల్, గ్యాస్, ఎరువులు లేకుంటే దేశంలోని 146 కోట్లమంది ప్రజలు ఏరకంగా జీవనం సాగిస్తారో మోడీ ప్రభుత్వం సమాధానం చెప్పాలి.
దేశంలో ఆర్థిక సంక్షోభం నెలకొన్న నేటి పరిస్థితుల్లో ప్రధాని నరేంద్రమోడీ జాతికి క్షమాపణ చెప్పాలని, దేశ ఆర్థిక స్థితిపై పార్లమెంటు సమావేశాలు ఏర్పాటుచేసి చర్చించాలని, అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

16 నెలలు… 16కు పైగా విజయాలు…

-స్పష్టమైన మార్పు చూపించిన ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమం -ఇదే స్ఫూర్తితో పనిచేయాలని ప్రభుత్వ యంత్రాంగానికి సీఎం చంద్రబాబు పిలుపు -ప్రజల సహకారంపై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *