అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
హనుమాన్ జయంతిని పురస్కరించుకుని మంగళవారం ‘భారతీయ హిందూ పరిషత్’ గుంటూరు జిల్లా తరఫున జిల్లావ్యాప్తంగా పలు ఆంజనేయ స్వామి దేవస్థానాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులతో కలిసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న ‘భారతీయ హిందూ పరిషత్’ క్రియాశీలక సభ్యులు ఆంజనేయ స్వామి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, ప్రజలు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో వుండాలని ఆకాంక్షించి శుభాకాంక్షలు తెలిపారు. పలువురు హిందూ ప్రముఖులను, దేవాలయాల నిర్వాహకులను సన్మానించి సత్కరించారు. అన్నప్రసాద వితరణ కార్యక్రమాలలో తమవంతు సహాయ సహకారాలు అందించి భక్తులతో మమేకమయ్యారు. సాయంత్రం శోభాయాత్ర కార్యక్రమం నిర్వహించి ఊరేగింపు, బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ‘భారతీయ హిందూ పరిషత్’ గుంటూరు జిల్లా అధ్యక్షులు అయినంపూడి శ్రీకాంత్, ‘మాతృశక్తి’ గుంటూరు జిల్లా అధ్యక్షురాలు మానేపల్లి రాజేశ్వరి మాట్లాడుతూ… భక్తి, నిబద్ధత, ధైర్యం, సేవాభావానికి ఆంజనేయస్వామి నిదర్శనమని, సమాజంలో ప్రతి ఒక్కరూ స్వామివారి ఆశయాలను ఆదర్శంగా తీసుకుని సేవా కార్యక్రమాలలో ముందుండాలన్నారు. హిందువులు అందరూ కులాలకు అతీతంగా ఏకమవ్వాల్సిన సమయం ఆసన్నమైందని అందరూ కలిసి కట్టుగా హిందూ సనాతన ధర్మాన్ని పరిరక్షించి, గోమాతని, మన సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్క హిందూవుపై వుందని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దుగ్గిరాల మండలం అధ్యక్షులు సూర్య వెంకటసుబ్బారావు, కృష్ణాజిల్లా అధ్యక్షులు పసుమర్తి వెంకటేశ్వరరావు, కృష్ణాజిల్లా ఉపాధ్యక్షులు కోన బాలాజీ, జిల్లా కార్యవర్గ సభ్యులు కోలవెన్ను రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
Tags amaravathi
Check Also
16 నెలలు… 16కు పైగా విజయాలు…
-స్పష్టమైన మార్పు చూపించిన ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమం -ఇదే స్ఫూర్తితో పనిచేయాలని ప్రభుత్వ యంత్రాంగానికి సీఎం చంద్రబాబు పిలుపు -ప్రజల సహకారంపై …
Prajavartha Online Telugu News