Breaking News

WB బృందంతో సమావేశాలు

-WB బృందంతో సమావేశాలు నిర్వహించిన APCRDA కమిషనర్ వి. విజయరామరాజు ఐఏఎస్, అడిషనల్ కమిషనర్(FAC) జి.సూర్యసాయి ప్రవీణ్ చంద్ ఐఏఎస్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రపంచ బ్యాంకు(WB) బృందం ప్రజారాజధాని అమరావతి అభివృద్ధి పురోగతిపై సమీక్షించేందుకు 2026 మే 11 నుంచి 12 వరకు 2 రోజులపాటు అమరావతిలో పర్యటించింది. WB ఆర్థిక సహకారంతో అమలవుతున్న రాజధాని అమరావతి అభివృద్ధి ప్రాజెక్టు పురోగతిని సమీక్షించేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు బ్యాంకు బృందం పేర్కొంది.

రాయపూడిలోని సిఆర్డిఏ ప్రధాన కార్యాలయ ఫస్ట్ ఫ్లోర్ ఆడిటోరియంలో బ్యాంకు బృందం తమ పర్యటనలో భాగంగా మంగళవారం.. పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యాలు(PPP), WB నుంచి రెండో విడత ఆర్థిక సహకారంపై సమావేశాలు నిర్వహించింది. ఈ సమావేశాలలో APCRDA కమిషనర్ వి. విజయరామరాజు ఐఏఎస్ గారు, అడిషనల్ కమిషనర్(FAC) జి. సూర్యసాయి ప్రవీణ్ చంద్ ఐఏఎస్ గారు, APCRDA స్ట్రాటజీ విభాగ డైరెక్టర్(I/C) అడుసుమిల్లి ఉమ, డిప్యూటీ డైరెక్టర్ ధనుంజయ జోషి, APCRDAలోని వివిధ విభాగాల అధికారులు, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్స్(PgMC) బృందం, అలాగే WB ప్రతినిధులు జెరాల్డ్, బాలా, క్వింగ్విన్ తదితరులు హాజరవ్వగా..WB బృందంలోని పలువురు సభ్యులు వర్చువల్‌గా ఈ సమావేశంలో పాల్గొన్నారు. PPP భాగస్వామ్యంపై నిర్వహించిన సమావేశంలో అమరావతి గ్రోత్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్(AGICL) ఎండీ SVR శ్రీనివాస్ గారు పాల్గొని సంబంధిత అంశాలపై చర్చించారు.

ఈ రోజు నిర్వహించిన సమావేశాల ద్వారా సిఆర్డిఏ..అమరావతిని సుస్థిరమైన, సమగ్రమైన, ప్రపంచ స్థాయి ప్రజారాజధానిగా అభివృద్ధి చేయాలనే తన కార్యాచరణ, ప్రణాళికను బ్యాంకు బృందానికి విశదీకరించింది. అంతర్జాతీయ సంస్థల సహకారంతో.. రాష్ట్ర ప్రజలకు ఆధునిక మౌలిక వసతులు, పారదర్శక పరిపాలన, మెరుగైన జీవన ప్రమాణాలు అందించే దిశగా ప్రజారాజధాని అమరావతి అభివృద్ధికి APCRDA కృషి చేస్తోందని కమిషనర్ గారు WB
బృందానికి తెలియజేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

16 నెలలు… 16కు పైగా విజయాలు…

-స్పష్టమైన మార్పు చూపించిన ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమం -ఇదే స్ఫూర్తితో పనిచేయాలని ప్రభుత్వ యంత్రాంగానికి సీఎం చంద్రబాబు పిలుపు -ప్రజల సహకారంపై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *