అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో పలువురు ప్రజలు తమ సమస్యలను తెలియజేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.
ప్రజల సమస్యలను అధ్యక్షులు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి, సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని త్వరితగతిన పరిష్కారం కోసం కృషి చేస్తామని ఆయన తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారానికి జనసేన పార్టీ నిరంతరం అంకితభావంతో పనిచేస్తుందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్, జీడీ నెల్లూరు ఇంచార్జ్ పొన్న యుగంధర్, పుంగనూరు ఇంచార్జ్ సీరివేలు గంగాధర్, తంబళ్లపల్లి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ సాయినాథ్, లీగల్ సెల్ నుంచి కంచి శ్యామల తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News