Breaking News

సింగిల్ యూస్ ప్లాస్టిక్ నిషేధం

-సింగిల్ యూస్ ప్లాస్టిక్ ని అమ్మితే ట్రేడ్ లైసెన్స్ రద్దు చేస్తాం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ మరియు విజయవాడ నగరపాలక సంస్థ స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ జి లక్ష్మీశ ఆదేశాల మేరకు సింగిల్ యూస్డ్ ప్లాస్టిక్ బ్యాన్ లో భాగంగా, నగర పరిధిలో గల అన్ని డివిజన్లో విస్తృతంగా సింగిల్ యూస్ ప్లాస్టిక్ నిషేధం పై డ్రైవ్ నిర్వహించి 15 కేజీ ప్లాస్టిక్ ని సీజ్ చేశారని, వ్యాపారస్తులు సింగిల్ యూస్ ప్లాస్టిక్ అమ్మితే వారి ట్రైన్ లైసెన్స్ లు రద్దు చేస్తామని విజయవాడ నగరపాలక సంస్థ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె. అర్జునరావు తెలిపారు.

ఈ సందర్భంగా చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కే అర్జునరావు మాట్లాడుతూ నగర పరిధిలో ఉన్న అన్ని షాపుల్లో శానిటరీ సూపర్వైజర్, ఇన్స్పెక్టర్ మరియు సెక్రెటరీలతో బుధవారం ఉదయం పలు షాపులను తనిఖీ చేసి రైడ్ నిర్వహించి 15 కేజీల సింగిల్ న్యూస్ ప్లాస్టిక్ను సీజ్ చేసి, 15,400 రూపాయల జరిమానా విధించారని తెలిపారు.

పర్యావరణహితమైన వస్తువులే వాడాలని, ఒకసారి వాడిపడేసే ప్లాస్టిక్ వస్తువుల వల్ల పర్యావరణానికి హాని కలుగుతుందని, ప్రజలకు, వినియోగదారులకు, అమ్మేవారికి, ప్రజారోగ్యం సిబ్బంది అవగాహన కల్పించారు. 120 మైక్రోన్ల కంటే తక్కువగా ఉన్న సింగిల్ యూస్ ప్లాస్టిక్ వస్తువులు భూమిలో కలవకుండా పర్యావరణానికి హాని కల్పించేవని వారికి చెప్పి, కేవలం పర్యావరణహితమైన గుడ్డ సంచులు, జ్యూట్ బాగులు, పేపర్ కవర్లు, వాడాలని వాళ్లకి అవగాహన కల్పించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

16 నెలలు… 16కు పైగా విజయాలు…

-స్పష్టమైన మార్పు చూపించిన ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమం -ఇదే స్ఫూర్తితో పనిచేయాలని ప్రభుత్వ యంత్రాంగానికి సీఎం చంద్రబాబు పిలుపు -ప్రజల సహకారంపై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *