విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అగ్నిమాపక చర్యలు పాటించనందుకు బబ్బురి గ్రౌండ్స్ లో గల గ్యాస్ సిలిండర్ ను సీజ్ చేశారు విఎంసి ఫైర్ సిబ్బంది. బుధవారం సాయంత్రం బబ్బురి గ్రౌండ్స్, భవానిపురం నందు విజయవాడ నగరపాలక సంస్థ రీజినల్ ఫైర్ ఆఫీసర్ డి. మాల్యాద్రి సిబ్బంది తో ఆకస్మికంగా తనఖి నిర్వహించారు.
ఈ పర్యటనలో కామన్ కిచెన్ ఉన్నపటికీ అమ్యూజ్మెంట్స్ వద్ద, అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉండే ప్రదేశాలలో వంట చేస్తున్నడం గమనించి, అవి అగ్ని ప్రమాదానికి దారి తీసే అవకాశం ఉన్నందున గ్యాస్ సిలిండర్ను సీజ్ చేశారు.
ఈ సందర్భంగా ఆర్ యఫ్ ఓ మాల్యాద్రి మాట్లాడుతూ ఎగ్జిబిషన్ ఆవరణలో స్టాల్స్ వద్ద కాకుండా కామన్ కిచెన్ దూరంగా ఒకటి అందరి కోసం పెట్టుకుని వంట వండాలని గంటం లో వారికి ఆదేశించినప్పటికీ వారు పాటించకుండా అమ్యూజ్మెంట్స్ సైడ్ బహిరంగ ప్రదేశంలో వండటం సురక్షితం కాదని గ్యాస్ సిలిండర్ను సీజ్ చేశారని, అంతేకాకుండా వారు అగ్నిప్రమాదం జరగకుండా వారు ఎటువంటి చర్యలు పాటించాలి వంటి అంశాలపై వారికి పూర్తిగా అవగాహన కల్పించమని తెలిపారు. మరోసారి అగ్నిమాపక చర్యలు పాటించకుండా ఏమైనా చేస్తే ఎగ్జిబిషన్ నే సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఈ పర్యటనలో స్టేషన్ ఫైర్ ఆఫీసర్ నరేష్, సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News