– స్థానిక ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి
– జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువగా పరిపాలన అందించాలనే లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి మార్గదర్శకాలకు అనుగుణంగా నియోజకవర్గ స్థాయిలోనూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) నిర్వహించడం జరుగుతోందని.. ఈ నెల 15వ తేదీ శుక్రవారం జి.కొండూరు మండలం, కుంటముక్కల గ్రామంలో ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి కార్యక్రమం జరుగుతుందని, స్థానిక ప్రజలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్‌తో పాటు వివిధ శాఖల జిల్లాస్థాయి అధికారులు కూడా పాల్గొంటారని తెలిపారు. ప్రజలకు పారదర్శకమైన, జవాబుదారీతనంతో కూడిన పరిపాలన అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రతి వినతిని పరిశీలించి సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు.
Prajavartha Online Telugu News