Breaking News

APCRDA ఆధ్వర్యంలో ఉచిత లైఫ్ సైన్సెస్ నైపుణ్య శిక్షణ & ఉద్యోగ అవకాశాలు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజారాజధాని అమరావతి ప్రాంత యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (APCRDA) మరో కీలక కార్యక్రమాన్ని ప్రారంభించింది. లైఫ్ సైన్సెస్ స్కిల్ సెక్టార్ కౌన్సిల్ సహకారంతో రాజధాని యువతకు ఉచితంగా 3 నెలల నైపుణ్య శిక్షణతో పాటు శిక్షణ అనంతరం ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు APCRDA ఉచిత శిక్షణ కార్యక్రమం ప్రారంభించింది. స్వర్ణభారత్ ట్రస్ట్, ఆత్కూరు, కృష్ణా జిల్లాలో జరిగే ఈ శిక్షణ కార్యక్రమం పూర్తిగా ఇండస్ట్రీ స్పాన్సర్డ్‌గా నిర్వహించబడుతోంది. శిక్షణ పొందే అభ్యర్థులకు ఉచిత వసతి, భోజన సౌకర్యాలు సైతం అందించబడతాయి. శిక్షణ తరగతులు ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించబడతాయి. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి ప్రొఫెషనల్ సర్టిఫికేషన్, ఇండస్ట్రీ నిపుణుల ద్వారా శిక్షణ, ప్లేస్‌మెంట్ సపోర్ట్ వంటి ప్రత్యేక అవకాశాలు లభించనున్నాయి. ముఖ్యంగా ఫ్రెషర్స్‌కు ఈ శిక్షణ ఉపయుక్తంగా ఉంటుంది.

ఉచిత శిక్షణ అనంతరం లభించు ఉద్యోగావకాశాలు:
ట్రైనీ – మైక్రోబయాలజిస్ట్ (క్వాలిటీ కంట్రోల్)
ట్రైనీ – ప్రొడక్షన్ మెషిన్ ఆపరేటర్ (స్టెరైల్ ఫార్మ్యులేషన్)
ట్రైనీ – కెమిస్ట్ (ప్రొడక్షన్ – ఫార్మా, కాస్మెటిక్స్ & బయోలాజిక్స్)

అర్హతలు:
B.Sc / M.Sc (మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ)
D.Pharm / B.Pharm / M.Pharm
డిప్లొమా / B.E / B.Tech (కెమికల్ సంబంధిత విభాగాలు)
ఏదైనా లైఫ్ సైన్సెస్ గ్రాడ్యుయేట్స్
2023 నుంచి 2026 వరకు పాసవుట్ అయిన అభ్యర్థులు అర్హులు.

ప్రధాన ప్లేస్‌మెంట్ భాగస్వాములు:
Biological E, Cohance, Granules, MSN, Biocon, Aurobindo, Cipla, Natco, Dr. Reddy’s, Hetero వంటి ప్రముఖ సంస్థలు ఈ శిక్షణ కార్యక్రమానికి భాగస్వాములుగా ఉన్నాయి.

అమరావతి రాజధాని ప్రాంత యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని APCRDA సోషల్ డెవలప్మెంట్ విభాగ గ్రూప్ డైరెక్టర్ వెలుగోటి రాములు గారు సూచించారు. శిక్షణకు నమోదు చేసుకునే చివరి తేదీ 17-05-2026 కాగా, ఆసక్తి గల అభ్యర్థులు వెంటనే నమోదు చేసుకోవాలని కోరడమైనది. వివరాలకై వాట్సాప్‌లో 9848424207(శంకర్)ను సంప్రదించవచ్చు.

రిజిస్ట్రేషన్ లింక్:
https://forms.gle/nshNbvbwzitM84Rs6

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

16 నెలలు… 16కు పైగా విజయాలు…

-స్పష్టమైన మార్పు చూపించిన ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమం -ఇదే స్ఫూర్తితో పనిచేయాలని ప్రభుత్వ యంత్రాంగానికి సీఎం చంద్రబాబు పిలుపు -ప్రజల సహకారంపై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *